header

Lala Lajpat Roy…లాలా లజపతి రాయ్

Lala Lajpat Roy…లాలా లజపతి రాయ్
స్వాతంత్ర్య సమరం నడిపిన తొలితరం నాయకులలో లాలా లజపతిరాయ్ ఒకరు. 1865 ఫిబ్రవరి 28వ తేదీన జన్మించారు.స్వాతంత్ర్య పోరాటంలో త్రిమూర్తలుగా పేరుపొందిన లాల్-బాల్-పాల్ లలో తొలివ్యక్తి ఈయనే.
ఒకవైపు న్యాయవాద వృత్తిలో కొనసాగుతూనే ఉద్యమాలలో ప్రవేసించారు. 1885సంలో. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భించిన నాటినుండి కాంగ్రెస్ సభ్యుడిగా ఉంటూ ప్రజలను తన ఉపన్యాసాల ద్వారా స్వాతంత్ర్య ఉద్యమం వైపు నడిపించాడు. గాంధీ రాకతో నాయకత్వం గాంధీకి అప్పగించి తనవంతు కృషిని కొనసాగించాడు.
సైమన్ కమీషన్ కు వ్యతిరేకంగా పాల్గొని బ్రిటీష్ అధికారి చేతిలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలయ్యాడు. తరువాత క్రమంగా నీరసపడిపోయి నవంబర్ 17 1928 సం.లో నిద్రలోనే తుదిశ్వాస విడిచారు. భారతదేశ ప్రజలు ముద్దుగా ఇతనిని ‘పంజాబ్ కేసరి’ అని పిలుచు కుంటారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ వ్యవస్థాపకుడు కూడా ఇతనే. /p>