header

Mahatma Gandhi….మహాత్మా గాంధీజి..

Mahatma Gandhi….మహాత్మా గాంధీజి..
అహింసా మార్గంలో భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించి 200 సం.ల బ్రిటీష్ వారి సుదీర్ఘ పాలనకు స్వస్తి చెప్పిన మహానీయుడు గాంధీజీ. తన మహోన్నత వ్యక్తిత్వంతో బారత దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పేరు గడించిన ఉన్నత వ్యక్తిత్వం గలవాడు. ఎందరో ప్రపంచ నాయకులకు మార్గదర్శకుడు. 20వ శతాబ్దంలో మానవాళిని అంతగా ప్రభావితం చేసిన నాయకుడు మరొకరు లేరు.
గాంధీ 1869 అక్టోబర్ 2వ తేదీన గుజరాత్ లోని పోర్ బందర్ లో జన్మించారు. గాంధీ ఇంగ్లాండ్ లో న్యాయ విద్యను అభ్యసించారు.
యావత్ భారతదేశ ప్రజలను ఒకే తాటిపైనడిపి భారత స్వాతంత్ర్య సాధనలో కీలక పాత్ర వహించిన ఘనుడు. 1920లో చేపట్టిన సహాయనిరాకరణోద్యమం, 1930లో ఉప్పు సత్యాగ్రహం, 1942లో క్విట్ ఇండియా ఉద్యమం గాంధీజీ జీవితంలో ముఖ్య ఘట్టాలు.
అంటరానితనం నిర్మూలన కోసం, మతాలకు అతీతంగా అన్ని వర్గాలవారిని సమానంగా చూడాలని చెప్పాడు. గాంధీ భార్య కస్తూర్బా. 1944 సం.లో ఆగా ఖాన్ ప్యాలెస్ లో నిర్భంధంలో ఉండగానే చనిపోయారు. ఆమె మరణించిన రోజు ఫిబ్రవరి 22వ తేదీన మనదేశంలో మదర్స్ డేగా జరుపుకుంటున్నాము.
1948 సం. జనవరి 30వల తేదీన నాధూరాం గాడ్సే జరిపిన కాల్పులలో ఈ మహనీయుడు కీర్తశేషులయ్యారు. గాంధీ అంత్యక్రియలకు హాజరైనవారితో 8 కిలోమీటర్లు నిండిపోయాయి. సుమారు 20 లక్షలమంది హాజరయ్యారు.
భారత ప్రజలు గాంధీని గౌరవంగా ‘జాతిపిత’ అని పిలుస్తారు. విదేశీ వస్తువులను బహిష్కరించాడు. జీవితాంతం ఖద్దరు బట్టలు ధరించాడు. బ్రీటీష్ వారి సత్కారాలను తిరస్కరించి స్వాతంత్ర్య ఉద్యమానికి జీవం పోసాడు. /p>