నేతాజీ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖ నాయకుడు. బ్రటీష్ వారికి వ్యతిరేకంగా సాయిధ పోరాటం నడిపిన యోధుడు. భారతజాతి మొత్తం గర్వించదగ్గ నాయకుడు. ఫార్వార్డ్ బ్లాక్ స్థాపకుడు. రెండు సార్లు భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించాడు.
1941 సం.లో కలకత్తా నుండి సింగపూర్ చేరుకుని 1943సం.లో జపాన్ వారి సహాయంతో సింగపూర్ లో భారతసైన్యాన్ని ఏర్పరచాడు. 1944 సం. ఫిబ్రవరి 4వ తేదీన అప్పటి బర్మా రాజధాని రంగూన్ నుండి ఈ సైన్యం భారత దేశానికి బయలు దేరింది. అప్పట్లో ఈ సైన్యం ధాటికి తట్టుకోలేక బ్రిష్ సైన్యం కుదేలైంది.
1945వ సం.లో ఆగస్టులో భారత సైన్యానికి సహకరించిన జపాన్ సైనిక దళాలు బ్రటీష్ వారికి లొంగిపోయాయి. ఫలితంగా బోస్ పింగపూర్ ను విడిచి వెళ్లాల్సి వచ్చింది.
బోస్ 1945 సం.ఆగస్టు 22న విమానప్రమాదంలో చనిపోయాడు. బోస్ మరణం గురించి నేటికీ స్పష్టమైన సమాచారం లేదు.
ఈయన 1879 సం.జనవరి 23వ తేదీన ఒరిస్సాలోని ఖాట్కలో జన్మించారు.
/p>