ఉక్కుమనిషిగా పేరుపొందిన వల్లభాయ్ పటేల్ గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు. స్వతంత్ర్యానంతరం కూడా గొప్ప సాహసంతో భారతదేశంతో కలవటానికి నిరాకరించిన 500 సంస్థానాలను పోలీస్ చర్యతో భారతదేశంలో వీలీనం చేసిన సాహసి. జర్మనీని ఏకం చేసిన బిస్మార్క్ లాగా భారత యూనియన్ లో స్వదేశీ సంస్థాలను విలీనం చేసిన ఉక్కు సంకల్పం పటేల్ ది. ఈ చర్యను ప్రధాని నెహ్రూ వ్యతిరేకించినా ఆయన ఆదేశాలను లెక్కచేయకుండా హైదరాబాద్ ప్రజలకు కిసాన్ వీరుడు విముక్తి కలిగించాడు.
1875 అక్టోబర్ 11వ తేదీన గుజరాత్ రాష్ట్రంలో ఒక చిన్న గ్రామంలో జన్మించాడు.
భారత దేశపు తొలి ఉపప్రధాని. ఇతనని ‘ఇండియన్ బిస్మార్క్’ గా పిలుస్తారు. న్యాయవాదిగా పేరు సంపాదించుకొని గాంధీతో ప్రభావంతో స్వతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నాడు. గుజరాత్ లోని రైతులను సంఘటితం చేసి బ్రిటీష్ వారి విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేసాడు. గుజరాత్ లో ప్రతిభావంతమైన నాయకుడుగా పేరుపొందాడు.
సర్దార్ పటేల్ గౌరవార్ధం పటేల్ యొక్క పెద్ద విగ్రహాన్ని గుజరాత్ లోని నర్మదానది తీరంలో సరోవర్ డ్యాంకు మూడు కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేసారు.
ఈ మహానాయకుడు 1950 సం.డిసెంబర్ 15వ తేదీన పరమపదించారు.