గోపాల కృష్ణయ్య కేవలం రెండు జతల బట్లలు గాంధీ బొమ్మ ఉన్న సంచిలో పెట్టకుని నిత్యమూ ఏదో ఒ ప్రజా ఉద్యమంలో పాల్గొనటానికి సిద్ధంగా ఉండేవాడు. ఇతను తెలుగువాడు. గోపాల కృష్ణయ్య భారత స్వాతంత్ర్య సమరయోధుడు, జాతీయవాది, సత్సంప్రదాయుడు, న్యాయవాది, గాంధేయుడు, నిరాడంబరుడు. స్వరాజ్య భిక్ష పేరుతో భీమవరపు నరసింహారావుతో కలసి ఇంటింటికి తిరిగి జొన్నలు, బియ్యం సేకరించి వాటితో కాంగ్రస్ కార్యకర్తలకు భోజనసదుపాయం కల్పించాడు.
వీరు 17 సెప్టెంబర్ 1906 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జన్మించారు. చదువుకునే రోజులలోనే గాధీజీచేత ప్రభావితుడై చదువుని వదలి అనేక ఉద్యమాలలో పాల్గొని జైలు శిక్షలు కూడా అనుభవించాడు. జీవితాంతం గాంధేయవాదిగా ఉన్నాడు. ఇతను రచయుత కూడా తెలుగులో 45, ఆంగ్లంలో 16 పుస్తకాలు రచించారు. ఇతని తొలి రచన శివాజి.
ఇతను ఆజన్మ బ్రహ్మచారి. తన 96వ ఏట 29 ఏప్రియల్ 2003 సంవత్సరంలో పరమపదించారు.
/p>