header

Vinayak Damodar Savarkar….వీర సావార్కర్.....
గొప్ప జాతీయవాది. 1920లో విప్లవపంధాలో బ్రిటీష్ వారిని గడగడలాడించిన గొప్ప సాహసి. ఇతను కేవలం స్వాతంత్ర్య సమరయోధుడే కాదు. గొప్ప కవి, రచయిత, వక్త. 1857 సంవత్సరంలో జరిగిన సిపాయుల తిరుగుబాటు గురించి ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అను గ్రంధాన్ని రచించారు.
ఆనాటి బ్రిటీష్ వారు భారతీయుల పట్ల అనుసరిస్తున్న దమనకాండకు చలించిపోయిన సావార్కర్ తన సోదరులతో సహా తమ కులదేవత ఎదుట భారతదేశ స్వాతంత్ర్యానికై పోరాడుతామని ప్రతిజ్ఙ చేసారు. బి.ఏ పూర్తి చేసిన సావార్కర్ లా చదవటానికి లండన్ వెళ్లాడు. కానీ భారతదేశ స్వాతంత్రానికై అక్కడ విప్లవకారులతో చేరి అక్కడే తన పోరాటం మొదలు పెట్టాడు. లా పూర్తి చేసినా బ్రిటీష్ రాణికి విధేయత ప్రకటించక పోవటంతో ఇతనికి లా పట్టా దక్కలేదు.
రెండు యావజ్జీవ శిక్షలు పడి 27 సంవత్సరాలపాటు అండమాన్ జైల్లో దుర్భరమైన జీవితం గడిపినా చలించని వీరుడు. శిక్షతోపాటు ఇతని యావదాస్తిని బ్రిటీష్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. 1911 జులై 4న ఇతని జీవితం అండమాన్ జైల్లో ప్రారంభమైంది. ఇక్కడే సావార్కర్ తన రచనా వ్యాసాంగాన్ని మొదలు పెట్టారు. తోటి ఖైదీలకు చదువు చెప్పారు. జైలులోనే, కమల, గోమాంతక్, మహాసాగర్ మొదలగు కావ్యాలు రచించారు.
1923 డిసెంబర్ లో వివిధవర్గాల వత్తిడి మేరకు వీరసావార్క్ ను మహారాష్ట్రలోని ఎరవాడ జైలుకు తరలించారు. తరువాత 1924 సంవత్సరం జైలు నుండి పూర్తిగా విడుదల చేసి రాజకీయాలలో పాల్గొనరాదు, జిల్లాను దాటి పోరాదనే షరతులు విధించారు.
తరువాత తన జీవితాంతం హిందూ సమాజ ఉద్దరణకై పాటుపడ్డాడు. హరిజనుని ఇంట టీ తాగి సనాతనుల ఆగ్రహానికి గురైయ్యాడు. అంటరానితనం మూలంగానే మతమార్పిడులు జరుగుతున్నాయని చాటిచెప్పాడు. 1929లో రత్నగిరి విఠలేశ్వరాలయంలోకి హరిజనులకు ప్రవేశం కల్పించాడు. ప్రజలలో ఐక్యత కోసం సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసాడు. సామూహిక గణేష్ ఉత్సవాలు, శివాజీ ఉత్సవాలు నిర్వహించాడు. భారతతీయులంతా ఒకటే అని చాటి చెప్పాడు. ఏ మతం వారు కూడా ప్రత్యేకం కాదని చెప్పాడు.
1938 సంవత్సరం బ్రీటీష్ ప్రభుత్వం సావార్కర్ పై అన్ని ఆంక్షలను ఎత్తివేసింది.
తన చివరిదశలో కూడా ఆరోగ్యం బాగులేని సమయంలో కూడా ‘‘భారత ఇతిహాసంలో ఆరు స్వర్ణపుటలు’’ అను రచనను మన చరిత్రలోని ముఖ్యఘట్టాలను వివరిస్తూ వ్రాసారు. అండమాన్ జైలులో తన దుర్భర జీవితం గురించి వ్రాసిన ఆత్మకథ మరాఠా చరిత్రలో పేరుపొందిన రచన. దీని ఆధారంగా ఎన్నో నాటకాలు కూడా వచ్చాయి.
భారతప్రభుత్వం కూడా కొంతవరకు ఇతని పట్ల నిర్ధయగా వ్యవహరించింది. గాంధీజీ హత్య తరువాత ఇతను అరెస్టు చేయబడ్డాడు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇతనికి తగినంత గౌరవం ఇవ్వలేదు.
వీరు 1883 మే 28వ తేదీన నాసిక్ జిల్లాలోని భాగూరు గ్రామంలో జన్మించారు. వీరు తన 86వ ఏట జీవితాన్ని త్వజించదలచి ఆహారాన్ని తీసుకోవటం వదలి పెట్టారు. వీరు 1866సం. ఫిబ్రవరి 26వ తేదీన కీర్తిశేషులయ్యారు.