వీరు అతివాద కాంగ్రెస్ నాయకులు. లోకమాన్య అనేది వీరి బిరుదు. కాంగ్రెస్ నాయకత్రయంగా పేరుబడిన లాల్-బాల్-పాల్ వీరిలో ఒకరు. భారత అశాంతి జనకుడని వీరిని అంటారు. స్వాతంత్ర్యం నా జన్మహక్కు, దానిని సాధించి తీరుతాను అనే నినాదం ఇచ్చారు. గీతా రహస్య, ఆర్కిటిక్ హోమ్ ఇన్ వేదాస్ అను గ్రంధాలను రచించారు.
ఆరోజులలోనే ఆంగ్ల విద్యనభ్యసించి బానిసత్వం అనుభవిస్తున్న భారతీయుల గురించి తెలుసుకున్నారు. ఆంగ్ల విద్యనభ్యసించారే కానీ అంగ్ల సంస్కృతిని అలవరచుకోలేదు.
వీరు రాజారాంమోహనరాయ్, దయానందులు, వివేకానందులు మొదలగు వారితో కలిసి భారతీయ సంస్కృతి పునరజ్జీవానికి అడుగులు వేసారు. ఈయన సంస్కృత పండితుల వంశంలోనుండి వచ్చారు, స్వయంగా సంస్కృత పండితుడు కూడా. పునా దక్కన్ కళాశాలలో గణితశాస్త్రంలో పట్టా పొందారు. తరువాత న్యాశాస్త్రం కూడా చదివారు.
తన చిన్ననాటి స్నేహితులతో కలసి దక్కన్ ఎడ్యకేషన్ సొసైటీ స్థాపించారు. యువతకు నాణ్యమైన విద్యను అందించటమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. ఈ సంస్థ సభ్యులు తిలక్ తో సహా ఉచితంగానే చదువు చెప్పేవారు.
కుటుంబంకోసం కాకుండా పమాజం కోసం, ఆతరువాతే భగవంతుని సేవయని చాటిచెప్పిన మహనీయుడు. బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమంలో లాలా లజపతిరాయ్, బిపిన్ పాల్ తో కలసి ముఖ్యమైన పాత్ర వహించారు. లాల్, పాల్ లతో పాటు చిత్తరంజన్ దాస్ కూడా ఈ ఉద్యంలో పాల్గొన్నారు. కానీ దరదృష్ణవశాత్తూ ఈ ఉద్యమం విఫలమై, కర్జన్ 1905లో బెంగాల్ ను మతప్రాతిపదిక మీద విభజించారు.
ఈ మహనీయుడు దేశద్రోహనేరంమీద 1908 నుండి 1914వరకు నేటి మయన్మార్ (బర్మా) లోని మాండలే జైలులో శిక్షను అనుభవించారు. అక్కడే గీతారహస్య పుస్తకాన్ని రచించారు.
ఈ మహానీయుడు 1920 ఆగస్టు 1వ తేదీన కీర్తిశేషులయ్యారు. చనిపోయే ముందుకూడా స్వరాజ్యాన్ని సాధించలేకపోతే భారతదేశానికి భవిష్యత్తే లేదు అని అన్న మహానీయుడు.
శాంతిస్వరూప్ భట్నాగర్