ఈమె అల్బేనియాలో జన్మించినప్పటికి తన జీవితకాలమంతా భారతదేశంలో దీనులకు సేవచేస్తూ గడిపిన మహనీయురాలు. మిషనరీస్ ఆఫ్ ఛారిటీ సంస్థను స్థాపించారు. ఈమె పేరుమీద భారతదేశమంతా వృద్ధాశ్రమాలు నడుపబడుచున్నవి.
ఈమె మీద మతప్రభావం ఎక్కువగా ఉంది. 12 సవంత్సరాల వయసులోనే తన జీవితాన్ని మతానికి అంకితం చేయదలుచుకున్నారు. 18 సం.ల వయసులోనే ఇల్లువదలి ఒక మత సంఘంలో చేరారు. తరువాత ఈమె ఎప్పుడూ తన స్వంతవారిని కూడా కలవలేదు. 1948 సం.లో సంప్రదాయ దుస్తులను వదలి నీలం అంచుగల తెల్లని నూలు చీరలను ధరించటం మొదలుపెట్టారు. భారతదేశ పౌరసత్వం స్వీకరించి కలకత్తాలోని మురికి వాడలలో సేవలు ప్రారంభించారు.. అనాధలను పోషించేది. వారి పోషణకోసం కావలిసిన డబ్బుకోసం కలకత్తా వీధులలో బిచ్చమెత్తింది.1950లో మిషనరీస్ ఆఫ్ ఛారిటీస్ అనే సంస్థను ప్రారంభించారు. అనాధ శరణాలయాలు, ధర్మశాలలు, కుష్టువ్యాధిగ్రస్తులకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పచారు. ఇవి నేటికి సేవలు అందిస్తున్నాయి.
ఈమెకు 1979లో నోబుల్ శాంతి బహుమతి లభించింది. 1980లో భారతరత్న అవార్డు లభించింది.
మదర్ థెరిసా యుగోస్లేవియాలో 1910 ఆగస్టు 26న జన్మించారు. ఈమె 1997 సెప్టెంబర్ 5వ తేదీన మరణించింది.
వీరు 1952 డిసెంబర్ 18వ తేదీన మరణించారు.