header

Ravbindranath Tagore…రవీంద్రనాథ్ టాగోర్

Ravbindranath Tagore…రవీంద్రనాథ్ టాగోర్
ఇతను గొప్ప కవి. నవలా రచయిత, నాటకకర్త, తత్వవేత్త మరియు విద్యావేత్త. భారతదేశానికి జాతీయగీతాన్ని అందించిన గొప్ప కవి.
1913సం.లో ఇతను తన రచయైన ‘గీతాంజలి’కి నోబుల్ ప్రైజ్ లభించింది. ఆసియా ఖండంలో నోబుల్ బహుమతి అందుకున్న మొదటి వ్యక్తి.
శాంతినికేతన్, విశ్వభారతి స్థాపకులు. ది క్రీసెంట్ మూన్, గోరా, గార్డెనర్, ది పోస్టపీస్ ఠాగూర్ ఇతర రచనలు.
వీరు కలకత్తా మహానగరంలో 1861 మే 7వ తేదీన జన్మించారు. చిన్నతనంలోనే హిమాలయ ప్రాంతంలో పర్వటించి ప్రభావితుడైనాడు. ఆ సమయంలోనే ప్రసిద్ధ వ్యక్తుల జీవితచరిత్రలను , ఇతర రచనలు, కాళిదాసు కవిత్వాన్ని అధ్యయనం చేసాడు. తను స్వయంగా రచనలు ప్రారంభించాడు.
1878లో లా చదవటానికి లండన్ వెళ్లాడు. కానీ చదువు వంటబట్టలేదు. చదువును ఆపి ఇంగ్లీష్ బాగా రాయటం, చదటం నేర్చుకుని ఐరిష్, స్పానిష్ జానపదగీతాలను నేర్చకున్నాడు. 1880 సం.లో భారతదేశానికి తిరిగి వచ్చాడు. 1883లో మృణాలినీ దేవితో వివాహం జరిగింది. వీరికి ఐదుగురు సంతానం. 1905లో తండ్రి మరణంతో జీవితంమీద ఆసక్తి తగ్గిపోయింది. అప్పట్లనే తన రచనల ద్వారా నెలకు రెండువేల రూపాయలు వచ్చేవి. వీటితోనే సామాన్య జీవితం గడపటం ప్రారంభించాడు.
నోబుల్ బహుమతి లభించింది. తరువాత బ్రిటీష్ రాణి ‘నైట్’ బిరుదును ఇచ్చారు. కానీ జలియన్ వాలాబాగ్ లో జరిగిన దరదృష్ణమైన సంఘటనకు కలత చెంది నైట్ బిరుదును అంగీకరించలేదు. అనేక దేశాలు పర్వటించారు. దాదాపు 35 దేశాలలో తిరిగి భారతదేశ గొప్పతనాన్ని చాటి చెప్పారు. విశ్వకవిగా పేరుపొందారు.
ఈ విశ్వకవి 1941వ సంవత్సరం ఆగస్టు 7వ తేదీన పరమపదించారు.