కిత్తూరు చెన్నమ్మ కూడా బ్రీటీష్ వారి నుండి తన రాజ్యాన్ని కాపాడుకోవటం కోసం వీరోచితంగా పోరాడి మరణించిన వీరనారి. రాణి కిత్తూరు చెన్నమ్మ గౌరవార్థం ఈమె విగ్రహం పార్లమెంటు ప్రాంగణములో, క్రీ.శ. 2007, సెప్టెంబరు 1న అప్పటి భారత ప్రథమ మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చే ఆవిష్కరింపబడినది. .
సంతానంలేని కిత్తూరు చెన్నమ్మ శివలింగప్ప అనే బాలుడుని దత్తత తీసుకుంటుంది. ఈ దత్తత అంగీకరించని బ్రిటీష్ వారు సైన్యంతో కిత్తూరును ఆక్రమించేందుకు యుద్దానికి వస్తరు. .
ఆ యుద్ధంలో సంగోళ్లి రాయన్న తన ఖడ్గచాలనంతో విజృంభిస్తాడు. కానీ బ్రీటీష్ సైనిక బలగం ఎక్కువగా ఉండటంతో రాయన్న మరియు చెన్నమ్మ బందీలుగా చిక్కుతాడు. కానీ రాయన్న పరాక్రమానికి మొచ్చుకుని బ్రిటీష్ వారు రాయన్నను విడచిపెడతారు. .
తరువాత బ్రిటీష్ వారి అరాచకాలకు అంతే లేకుండా పోతుంది. ప్రజల నుండి అధిక శిస్తులు వసూలు చేయసాగారు. .
రాయన్న అడవులలో వెళ్లి సొంతంగా సైన్యాన్ని తయారు చేసుకుని, తెల్లవారి తొత్తులైన జమీందారులను దోచుకుని ఆ సొమ్మును బీదలకు పంచిపెడతాడు. బ్రీటీష్ వారి ఆఫీసులను తగులబెడతాడు. వారి ఖజానాలను దోచుకుంటాడు. .
బ్రిటీష్ వారి చెరలో ఉన్న రాణి చెన్నమ్మ చనిపోతుంది. రాయన్న దళాలు రగిలిపోయి బ్రిటీష్ వారిని నేరుగా ఎదుర్కునేందున తగిన సైన్యాన్ని సమకూర్చుకుంటారు. .
బహిరంగయుద్ధంలో రాయన్నకు తిరుగులేకుండా పోతుంది. రాయన్నను ముఖాముఖా యుద్ధంలో గెలవలేమని బ్రిటీష్ వారు కుట్ర చేసి రాయన్న అనుచరుడి సాయంతో, రాయన్న చేతిలో ఆయుధం లేనప్పుడు బ్రిటీష్ సైనికులు ఇతనిని బంధిస్తారు. .
తరువాత విచారణ జరిపి రాయన్న ఉరిశిక్ష విధిస్తారు. 1831 సం. జనవరి 26వ తేదీన నందగడ్ జిల్లాలో మర్రిచెట్టుకుఉరితీస్తారు. రాయన్న అనుచరులు ఇతని భౌతికా కాయన్ని నందగడ్ లోని సమాధి చేసి గుర్తుగా మర్రిచెట్టును నాటతారు. రాయన్న సమాధి 8 అడుగుల పొడవుంటుంది. మర్రిచెట్టు నేటికి చక్కగా పెద్దదయింది. చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలు రాయన్న లాంటి పుత్రుడు తమకు జన్మించాలని ఆ చెట్టుకు ఉయ్యాలలు కడతారు. సమాధికి దగ్గరలోనే ఆశోక స్థంభం కూడా ఏర్పాటు చేయటం జరిగింది. సంగోళ్లి గ్రామంలోనే రాయన్నకు గుడి కూడా కట్టారు. రాయన్న పుట్టిన రోజునే ఆగస్ట్ 15వ తేదీన భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. ఇతను ఉరితీయ బడ్డ రోజునే జనవరి 26న భారతదేశం రిపబ్లిక్ గా అవతరించింది. .
2012 సం.లో సంగోళ్లి రాయన్న అనే సినిమాను కన్నడంలో నిర్మించి విడుదల చేశారు.