header

Aryabhatta…ఆర్యభట

Aryabhatta…ఆర్యభట్ట
గుప్తుల కాలానికి చెందిన ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త. గణితశాస్త్రంలో అనేక సిద్ధాంతాలకు రూపకర్త ఆర్వభట్టే. 23సంవత్సరాల వయసులోనే ఆర్వభట్ట వ్రాసిన ‘‘ఆర్వభట్టీయం’’అనే గణితశాస్త్ర గ్రంధంలో ఎన్నో గణితశాస్త్ర సూత్రాలు తెలియపరచబడ్డాయి. ‘పై’ ని ఒక నిష్పత్తి రూపంలో వ్రాయటంఅసాధ్యమని తేల్చిన మొదటి వ్యక్తి కూడా ఈయనే.
ఖగోళశాస్త్రంలో కూడా ఆర్వభట్ట పండితుడు. గ్రహాలు గుండ్రగా కాకుండా దీర్ఘ వృత్తాకారంలో తిరుగుతున్నాయని ప్రతిపాదించాడు, భూమి తన చుట్టు తాను తిరుగుచున్నదని చెప్పినవారు కూడా ఆర్వభట్టే. అంతేకాదు సమయాన్ని ఖచ్చితంగా లెక్కించాడు కూడా. 23 గంటల 56 నిమిషాల నాలుగు సెకన్లుగా గుణించాడు. ఈ విషయం పాశ్చాత్తులు గ్రహాంచటానికి మరో వేయు సంవత్సరాలు పట్టింది.
ఐదో శతాబ్ధంలోనే కనిపెట్టబడ్డ ఈ సిద్ధాంతాలు తరువాత అరబ్బుశాస్త్రజ్ఙుల ద్వారా బయటకు వచ్చాయి కానీ, వాటి వెనుక ఉన్న భారతీయుల విజ్ఙానం మాత్రం మరుగున పడిపోయింది. భూమి నీడ చంద్రుని మీద పడటం వలనే గ్రహణాలు వస్తాయని రాహుకేతువులు కారణం కాదని వాదించాడు. భూమి నీడ చంద్రునిమీద గోళాకారంలో పడటంవలన భూమి గుండ్రంగా ఉంటుందని గ్రీకు శాస్త్రవేత్తలు కనిపెట్టింది ఆర్వభట్ట సిద్ధాంతాల ఆధారంగానే. కానీ ఆర్వభట్ట కనిపెట్టిన సిద్ధాంతాలను నమ్మేంత జ్ఙానం ఆనాటి భారతీయులలో లేకపోవటం దురదృష్ణం. భూమి యొక్క ఆకారం గోళాకారం ఉంటుందని ఆరోజులలో తాను రచించిన ‘గోళాధ్యాయం’ లో తెలిపాడు. గ్రహాల యొక్క వెలుగు స్వయంప్రకాశం కాదని సూర్యుని వెలుగు వాటిమీద పడటంవలన ప్రకాశిస్తాయని తెలిపాడు. భూమి యొక్క వ్యాసము, చుట్టుకొలతల గురించిన తెలిపిన వివరాలు ఆధునిక శాస్తజ్ఙులు తెలిపిన వివరాలకు దగ్గరగా ఉన్నాయి.
ఈయనమీద గౌరవంతో 1975లో ప్రయోగించిన భారతీయ తొలి ఉపగ్రహానికి ‘ఆర్యభట్ట’ అని పేరుపెట్టారు. బీజగణితంలో అనేక సిద్ధాంతాలకు మూలకర్త. రేఖాగణితంలో ఉపయోగించే పై విలువను ఖచ్చితంగా గుణించిన వ్యక్తి. సున్నా యొక్క విలువను తెలియజేసిన వారు.
ఆల్ ఖో వారిజ్ఙి, ఆల్ బెరూని వంటి ప్రఖ్యాత అరబ్ పండితులు తమ రచనలలో ఆర్వభట్ట గురించి వ్రాసారు.
ఇతను క్రీస్తు శం 426 సం. బీహార్ లోని పాట్నా సమీపంలోని కుసుమపురంలో జన్మించినట్టు చెబుతారు. మరియు ఇతనిని చంద్రగుప్త విక్రమాదిత్యుని ఆస్థానంలోని వాడుగా చెబుతారు. గ్రీకులు, అరబ్బులు కూడా ఇతని సిద్ధాంతాలనే కాపీ కొట్టారంటారు. ఇతని శిష్యుడు భాస్కరాచార్యుడు కూడా గొప్ప ఖగోళ, జ్యోతిష్య శాస్త్రవేత్తగా పేరుపొందాడు.