12వ శతాబ్దానికి చెందిన గొప్ప గణిత శాస్త్రవేత్త. ఖగోళ శాస్త్ర విషయాలను శోధించి సిద్ధాంత శిరోమణి అనే గ్రంధాన్ని రచించారు. లీలావతి అనే గణిత శాస్త్రాన్ని రచించారు. భాస్కరాచార్యలు కనుగొన్న గణిత సూత్రాలు నేటికి కూడా పాశ్చాత్యులను ఆశ్చర్యపరుస్తున్నాయి.
వీరు క్రీ.శ 1114లో మహారాష్ట్రలోని విజయపురం అనే గ్రామంలో జన్మించారు. చిన్నప్పటి నుండి గణితంలో అనేక పరిశోదనలు చేసాడు. గణితంలోనే కాకుండా భాస్కరులు జ్యోతిషంలో మంచి దిట్ట. ఒక కుండలో నీరు, ఇసుక పోసి, కుండకు అడుగున ఒక చిల్లుపెట్టి దానిని ఇంకొక కుండపై పెట్టి పైకుండలోని పడే నీటి చుక్కల ఆధారంగా ముహూర్తాలు నిర్ణయించేవాడు.
ఇతని కుమార్తె లీలావతి. ఈమెకు వివాహమైన ఒక సంవత్సరంలోపే భర్త చనిపోవటంతో ఆ దుఃఖం తట్టుకోలేని లీలావతికి గణితం నేర్పించాడు. ఈ విధానం వలన ఎన్నో గణిత సూత్రాలు కనుగొని ప్రపంచ ప్రఖ్యాతి పొందాడు. లీలావతి కూడా పేరు పొందింది.
క్రీ.1150లో ఈయన రచించిన గ్రంధం సిద్ధంత శిరోమణి ప్రపంచానికి ఒక గొప్ప కానుక.
భారతీయుల దురదృష్టం, ఆంగ్లేయుల కుయుక్తుల వలన భారతీయులు కనిపెట్టిన విషయాలు బయట ప్రపంచానికి తెలియ లేదు. అందులో ఒకటి న్యూటన్ గురుత్వాకర్షణ.
800ల సంవత్సరాలకు పూర్వమే భాస్కరాచార్యుల గ్రంధంలో వ్రాయబడిని ఈ క్రింది విషయాన్ని గమనించండి.
‘‘వస్తువులు భూమి యొక్క ఆకర్షణ వలనే భూమిపై పడుచున్నాయి. కాబట్టి భూమి, గ్రహాలు, సూర్యుడు, చంద్రుడు కూడా పడిపోకుండా వాటి కక్ష్యలలో తిరుగుతున్నాయి. వాటికి కూడా ఆకర్షణలు ఉన్నాయి’’ ఇంత స్పష్టంగా చెప్పినా కూడా ఈ విషయంలో ప్రాచుర్యంలోకి రాకపోవటం భారతీయుల దురదృష్టం. కనీసం భారతీయులందరూ ఈ విషయం తెలుసుకోలేక పోవటం ఇంకా విచారకరం.
తరువాత భాస్కరాచార్యులు ఉజ్జయనీలోని ఖగోళ గణిత శాస్త్ర సంస్థ అధ్యక్ష పదవిని చేపట్టారు. భారతదేశపు ఉపగ్రహాలు వీరి మీద గౌరవంతో భాస్కర-1, భాస్కర-2 అని పేరు పెట్టారు. క్రీ.శ 1185 లో వీరు మరణించారు.