భారతదేశంలో భౌతికశాస్త్రంలో మొట్టమొదటి నోబుల్ ప్రైజ్ విజేత, విశ్వవిఖ్యాత భౌతిక శాస్త్రవేత్త సి .వి. రామన్.
రామన్ కు 1930 సం.లో నోబుల్ బహుమతి లభించింది. ‘‘రామన్ ఎఫెక్ట్’’ అనే పరిశోధన ఈ బహుమతి వీరిని వరించేలా చేసింది. రామన్ ఎఫెక్ట్ అనగా కాంతికిరణం. కాంతి పారదర్శ్ పదార్ధం గుండా ప్రయాణించినప్పుడు, దానిలో కలిగే మార్పులను వివరిస్తుంది. దీనిద్వారా 2000 రసాయన మిశ్రమాల నిర్మాణం కనుగొనగలిగారు. చివరకు లేజర్ కిరణాల ఆవిష్కరణ తరువాత ఈ రామన్ ఎఫెక్ట్ ప్రాముఖ్యత, అవసరం మరింత పెరిగింది.
ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు నందు డైరెక్టర్ పదవిలో దాదాపు పది సంవత్సరాలు పనిచేశారు. ఈ దశలో ఎందరికో ప్రోత్సాహం కలిగించారు. దేశవిదేశాలలో వీరికి ఎన్నో పురస్కారాలు లభించాయి. భారతప్రభుత్వం వీరిని ‘‘భారతరత్న’’ తో సత్కరించింది.