header

జె.సిబోస్ / JC Bose

జె.సిబోస్ (1858-1937) / JC Bose
మొక్కలు మానవుల లాగానే స్పందిస్తాయి. అవి రోదిస్తాయి, సంతోషపడతాయి. మనకు లాగే కోపం, సంతోషం కలిగి ఉంటాయని తొలిసారిగా ప్రపంచానికి నిరూపించిన ఆధునిక శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్. ఇతను భౌతిక శాస్త్రవేత్తే కాకుండా, వృక్ష శరీర ధర్మశాస్త్రం మీద కూడా అనేక పరిశోధనలు చేసి, భౌతిక శాస్త్రానికి, శరీర ధర్మ శఆస్త్రానికి మధ్యనున్న అడ్డుగోడలను తొలగించాడు. తన సిద్ధాంతం నిరూపించటానికి బోస ‘‘రాసోనేట్ రికార్డర్’’ అనే పరికరాన్ని తయారు చేశాడు. ఇది చెట్టులో జరిగే సూక్ష్మాతి సూక్ష్మమైన మార్పులను కూడా గుర్తించగలదు. తన పరిశోధనలను ‘‘Plant Physiological Investigation” అనే పుస్తకంలో ప్రచురించుడ. దాదాపు 150 పరిశోధనా వ్యాసాలను ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక సభలలో సమర్పించాడు.
తన పరిశోధనలను నిరూపించడానికి ఇతను ఎన్నో పరికరాలను తానే తయారుచేసుకున్నాడు. అందులో ఎంతో ముఖ్యమైనది ‘‘క్రిస్కోగ్రాఫ్’’ ఇది ఒక వస్తువును 10 మిలియన్ల రెట్లు పెద్దదిగా చేసి చూపిస్తుంది. అందువల్ల అతి సూక్ష్మమైన కదలికలను కూడా గుర్తించడానికి వీలైంది. దీనిని ఇప్పటికీ శాస్త్రవేత్తలు ఉపయోగిస్తూనే ఉన్నారు.
ఇతను పదార్థం యొక్క నిర్మాణాన్ని మైక్రోవేవ్స్ సహాయంతో తెలుసుకొనే పరికరాన్ని కనుగొన్నాడు. ఇతను కనుగొన్న ‘‘వేవ్ గైడ్’’ అనే మరో పరికరం కొలత సాధనం. దీనిని సున్నితమైన న్యూక్లియర్ పరికరాలలో నేటికి ఉపయోగిస్తున్నారు.
జె.పి. బోస్ ప్రెసిడెన్సీ కాలేజీలో పనిచేసే సమయంలో ‘‘వైర్ లెస్ ట్రాన్స్ మిషన్ ’’ అనే పరికరాన్ని తయారు చేసాడు.ఇది మార్కోని కన్నా ముందుగానే కనిపెట్టినట్లు లండన్ లో పలు సభలలో తెలియచేసినట్లు ఆధారాలు ఉన్నాయి.
ఎన్నో పరిశోదనలతో ఆధునిక విజ్ఞాన రంగంలో తిరుగులేని కీర్తి పొంది మనకు ఎన్నో పరిశోధన ఫలాలను అందించిన బోస్ 1837లో పరమపదించారు.