header

రామానుజం / Ramanujam

రామానుజం (1887-1920) / Ramanujam
20వ శతాబ్ధపు మేధావులలో, గణిత శాస్త్రంలో రామానుజం అసామాన్య మేధావని విదేశీ శాస్త్రజ్ఞులు ప్రశంసించారు.
రామానుజం తమిళనాడులోని కుంభకోణంలో జన్మించాడు. సాధారణ కళాశాల విద్య తరువాత మద్రాసులో పోర్టుట్రస్టులో గుమాస్తా ఉద్యోగంలో చేరాడు.v చిన్నతనం నుండీ రామానుజానికి లెక్కలంటే చాలా ఇష్టం. గణితానికి సంబంధించన వివిధ లెక్కలు వేస్తూ ఉండేవాడు. లెక్కలనే సమస్తంగా భావిస్తూ ఉండేవాడు.
1911 సంవత్సరంలో “Bernoulli’s Numbers” లక్షణాల మీద పరిశోధనా వ్యాసం “The Journal of Indian Mathematical Society” అనే పత్రికలో ప్రచురించాడు. ఇతనికి 1913లో మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి ‘‘రీసెర్చ్ ఫెలోషిప్’’ లభించింది. 1914 సం.లో ఫ్రొఫెసర్ హార్డి అనే కేంబ్రిడ్జి విశ్వవిదాయలయం ప్రొఫెసర్ రామానుజానికి స్కాలర్ షిప్ ఇప్పించి కేంబ్రిడ్జిలో పరిశోధించే అవకాశం కలిగించారు.
గణితంలో అంకెలకు సంబంధించి రామానుజం అనేక సిద్ధాంతాలను రూపొందించాడు. వాటిలో ఒకటి ఒక సూత్రం ఉపయోగించి ఏ సంఖ్యనైనా క్రమబద్ధమైన అంకెల వరుసతో విడదీయవచ్చు అనేది.
అనారోగ్య కారణంగా కేంబ్రిడ్జి నుండి భారతదేశాని తిరిగివచ్చాడు రామానుజం. ట్రినిటీ కళాశాల ఫెలోషిప్ పొందిన ప్రథమ భారతీయుడు రామానుజం. రాయల్ సొసైటీ ఆఫ్ ఇంగ్లాండ్ కూడా రామానుజానికి సభ్యత్వం ఇచ్చింది. రామానుజం గణితం మీద రాసుకున్న నోట్సును టాటా ట్రస్టు పుస్తకరూపంలోకి తీసుకువచ్చింది. ఈపుస్తకం ఎంతో ప్రాముఖ్యత పొందింది.