వీరు గొప్ప శాస్త్రవేత్త. దేశంలో చాలా ప్రయోగశాలలు ఏర్పాటు చేయటంలో వీరి పాత్ర ఉంది. భారత సాంకేతిక, పారిశ్రామిక మండలికి డైరెక్టర్ గా పనిచేసారు. యు.జి.సి ఛైర్మన్ గా, విద్యాశాఖకు కార్యదర్శిగా పనిచేసారు. భారతదేశానికే గర్వకారణం భట్నాగర్.
పారిశ్రామిక రసాయనాలపై ఎక్కువగా ప్రయోగాలు చేసారు. 1941 సం.లో వీరి పరిశోధనలకు బ్రిటీష్ ప్రభుత్వం ‘సర్’ బిరుదును ప్రధానం చేసింది. మనం పని చేద్ధాం ఇతరులకు పని కల్పిద్దాం అనే సద్భావనతో భారతదేశంలో మొత్తం 12 పరిశోధనా శాలలను ఏర్పాటు చేసారు.
నేటి పాకిస్తాన్ లోని రావల్సిండి ప్రాంతంలో బ్రీటీష్ వారు చమురు తీస్తుండగా ఏదురైనా సమస్యను పరిష్కరించారు. దీనికి గాను భట్నాగర్ కు లక్షా ఏబైవేల రూపాయలు బహుకరించారు. కానీ భట్నాగర్ ఈ సొమ్మును లాహోర్ యూనివర్శటీకి చమురు పరిశోధనకై ఇచ్చారు.
మనదేశంలో చమురు వనరులు, అణు ఖనిజ పరిశ్రమలు అభివృద్ధి చెందటంలో వీరి కృషి అపారం. వీరి మీద గౌరవంతో భట్నాగర్ అవార్డును ఏర్పాటు చేయటం జరిగింది. శాస్త్ర, సాంకేతిక రంగాలలో ప్రతిభావంతులకు ఈ అవార్డు బహుకరిస్తారు.
వీరు 1955 జనవరి 1వ తేదీన మరణించారు