ఈయన పేరుతో “Bosons” అనే కణములు గుర్తింపబడ్డాయి. అణుభౌతిక శాస్త్రంలో వీరు చేసిన కృషి చాలా గొప్పది. వీరు “Plank’s law and light quantum hypothesis” అనే పరిశోధనా వ్యాసం రచించారు. దీనిని ఎందరో ప్రముఖులకు పంపగా వారు దీనిపై సరిగా స్పందించలేదు.
చివరకు 1924 సంవత్సరంలో వ్యాసాన్ని ‘‘ఆల్బర్ట్ ఐన్ స్టీన్ కు పంపగా ఆయన దీనిని మెచ్చుకుని స్వయంగా తానే జర్మన్ భాష లోకి అనువదించటమే కాకుండా శాస్త్రపరిశోధనలో ఇదొక ముందడుగు అని తెలిపారు.పోటాన్, ఆల్ఫా పార్టికల్స్ ఒక రకమైనటువంటి రేడియోషన్ ను వెలువరిస్తాయి.
ఈ రేడియేషన్ ప్రవర్తనను వ్యక్తీకరించే గణాంకాలను ‘‘బోస్ స్టాటిటిక్స్’’ అంటారు. అలా దీని కనుగుణంగా ప్రవర్తించే కణాలను “Bosons” అని పిలుస్తారు. తనూ, మేఘనాథ సాహ ఇద్దరూ కలిసి ఐన్ స్టీన్ “Papers on Relativity”ని ఆంగ్లంలోకి అనువదించిన మొదటి భౌతిక శాస్త్రవేత్తలు.