శిశిర్ మిత్రా 1923 సం.లోనే భారతదేశంలో రేడియో ట్రాన్స్మిటింగ్ స్టేషన్ నెలకొల్పారు. 1927 సం.లో మనదేశంలో రేడియో ప్రసారాలు ప్రారంభం అయ్యాయి.
రేడియో ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్ రంగంలో వీరి కృషి, పరిశోధనల ద్వారా వీరికి ప్రపంచ ఖ్యాతి లభించింది. వీరు ‘ఐనోస్పేర్’ గురించి విస్త్రుతంగా పరిశోధించారు. ఒక రేడియో స్టేషన్ గానీ, టి.వి. స్టేషన్ గానీ ప్రసారం చేసే తరంగాలు భూఉపరితలం మీద మీద వ్యాపించిన అమోనొస్ఫెయర్ ను తాకి, తిరగి భూమికి ప్రసరిస్తాయి. దీని వలననే మన రేడియోలు, టి.విలు అ తరంగాలను గ్రహించి ప్రసారాలను అందించగలవు.
‘రేడియో ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్‘ అనే సంస్థను కూడా ఇతను స్థాపించాడు. వీరి కృషికి 1962 సంవత్సరంలో పద్మ భూషణ్ లభించింది.