header

Susruthudu..శుశ్రుతుడు

Susruthudu..శుశ్రుతుడు
క్రీ.శ. 4వ శతాబ్దానికి చెందిన గొప్ప భారతీయ వైద్య శాస్త్రవేత్త. శస్త్రచికిత్సా పితామహుడు. మెదడు, కళ్లు, ప్లాస్టిక్ సర్జరీ మొదలగు సున్నితమైన,క్లిష్టమైన శస్త్రచికిత్సల గురించి ఆప్పటి రోజులలో తెలియచేయటం భారతీయు వైద్యశాస్త్రానికే గర్వకారణం. వీటన్నింటి గురించి ‘‘సుశ్రుత సంహిత’’ అనే గ్రంథంలో వివరించారు. చరకుడు శుశ్రుతుడు, వాగ్భటుడు భారతీయ వైద్యవిజ్ఙానాన్ని అత్యున్నత స్థాయిలో నిలబెట్టారు.
ఇతను జీవించిన కాలం వివరాలు ఖచ్చితంగా లభ్యం కావటంలేదు. కానీ క్రీ.పూ. 600 తరువాత కాలానికి చెందినవాడుగా చెబుతారు. ఈజిప్టులోని ప్రాచీన దేవాలయం ‘కొమాంబో’ గోడల మీద కొన్ని శస్త్రచికిత్సా సాధనాలు చెక్కి ఉన్నాయి. ఇవి శుశ్రుతుడు చెప్పిన సాధనాలను పోలి ఉన్నాయి. దీనిని బట్టి భారతీయ విజ్ఙానం ఆనాటికే నైలు నది దాకా విస్తరించిందంటారు.
ఆ నాడే శస్త్రచికిత్సలలో వాడే సాధనాలగు గురించి శుశ్రుతుడు తెలిపిన విషయాలు ‘‘శస్త్రచికిత్సా సాధనాలు బంగారం, వెండి, ఏనుగు దంతంతో తయారయ్యేవి. శ్రేష్టమైన ఉక్కుతో తయారయ్యేవే శ్రేష్టమైనవి. వెంట్రుకను రెండుగా చీల్చగల పరికరాలు ఉండాలని తెలియపరచాడు.
శుశ్రుతుడు సంస్కృతంలో వ్రాసిన ‘శుశ్రుత సంహిత’ తరువాత కాలంలో లాటిన్ భాషలోనికి, జర్మన్ భాషలోనికి, ఆంగ్లంలోకి అనువదించ బడ్డది. వ్యాధులు రెండురకాలని మందులతో తగ్గేవి, శస్త్రచికిత్సతో తగ్గేవి అని ఆనాడే ఇతని గ్రంథంలో తెలియపరచబడ్డది. శరీర నిర్మాణం, అనాటమీ గురించి ఈ గ్రంథంలో తెలుపబడింది.
విష్పల అనే స్త్రీ తన కాలు కోల్పోయినపుడు లోహంలో చేసిన కాలును అమర్చాడని ఒక కథనం ఉంది. కండ తెగి రక్తస్రావం అవుతున్నపుడు కండ అంచులను దగ్గరకు లాగి కుట్లు వేయటం, రక్తం కారుతున్న రక్త నాళాలను (రసాయనాల ద్వారా) కాల్చటం ద్వారా రక్తస్రావాన్ని ఆపటం వంటి విషయాలన్నీ ఇతని గ్రంథంలో ఉన్నాయి. ఎనస్థీషియా విధానాలను, వరిబీజంలో నీటిని తీసేందుకు వాడే ‘వ్యవధాన’ ఉపకరణం, నాళాలలో ఇరుక్కు వాటిని తొలగించే ‘ఈషణ’ (ప్రోబ్) మొలలు, లూటీ వ్యాధిని నివారించేందుకు ఉపయోగించే సాధనాలు, చిల్లులు పడిన పేగులకు చేసే శస్త్రచికిత్సలు, షుగరు, బి.పి వ్యాధుల గురించి శుశ్రుతునిచే చెప్పబడిన విషయాలు నేటి ఆధునిక వైద్యానికి దగ్గరగా ఉన్నాయి. ఆరోజులలో మూత్రనాళ అడ్డంకులు వాటిని తొలగించే విధానాలు, మూత్రపిండాలలో ఏర్పడే రాళ్లు, వాటిని తొలగించే శస్త్రచికిత్సలు, చాలా వ్యాధులను నివారించే ఫార్మూలాలు తెలియపరచాడు.
తొలి ప్లాస్టిక్ శస్త్రచికిత్సా పితామహుడు శుశ్రుతుడు. ఇతని విజ్ఞానాన్ని ఆనాటి సమాజం, నేటి భారతీయులు ఉపయోగించుకోవక పోవటం మన దురదృష్ణం.