header

విక్రమ్ సారాభాయ్ / Vikram Sarabhai

విక్రమ్ సారాభాయ్ (1919-1971) / Vikram Sarabhai
భారతీయ అంతరిక్ష పరిశోధనకు, విజయాలకు మూలపురుషుడు డా. విక్రమ్ సారాభాయ్. సారాభాయ్ 1919 సంవత్సరం ఆగష్టులో జన్మించారు. చిన్న, చిన్న రాకెట్ల నుండి, అతి పెద్ద రాకెట్ ప్రయోగ వాహన నౌకలు, ఉపగ్రహాలు, ప్రయోగించే దశకు భారత్ ఎదిగి రావటానికి సారాభాయ్ నిరంతర పరిశోధనలు, దీక్ష, కృషి కారణం.అంరిక్ష పరిశోధనలు దేశావసరాలైన విద్య, కమ్యునికేషన్స్, భూగర్భ వనరులు, రక్షణ, వాతావరణ పరిశోధన, మొదలైన రంగాలలో ఉపయోగపడే విధంగా రూపకల్పన చేశారు.
1975 సంవత్సరంలో భారతదేశపు మొదటి ఉపగ్రహం ఆర్యభట్ట సోవియట్ దేశం నుంచి ప్రయోగించారు. దీని రూపకర్త కూడా సారాభాయ్. సారాభాయ్ ని భారతప్రభుత్వం పద్మవిభూణ్ బిరుదుతో సత్కరించింది. వీరు ISRO అధినేతగా కూడా పనిచేసి దానిని మేటి సంస్థగా రూపొందించారు.
సారాభాయ్ 1971 సంవత్సరం డిసెంబరు 31న పరమపదించారు.