భారత దేశానికి చెందిన వైద్య శాస్త్రజ్ఞులలో ప్రసిద్ధి వ్యక్తి. హార్వార్డ్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసన్ నుండి డిప్లొమా పొందిన తరువాత, లెద్రలే ప్రయోగశాలలలో చేరాడు.
యల్లాప్రగడ రూపొందించి హెట్రజాన్ అనే మందు ప్రపంచ ఆరోగ్య సంస్థచే బోదకాలు నివారణకు ఉపయోగించబడుతుంది.
శ్రీ యల్లాప్రగడ సుబ్బారావు పర్వవేక్షణలో బెంజిమన్ డుగ్గర్ 1945లో ప్రపంచంలోనే మొదటి టెట్రాసైక్లిన్ యాంటీ బయాటిక్ ‘‘అరియోమైసిన్’’ ను కనుగొన్నారు. ‘‘పెస్క్’’ అను నతడు అసూయతో సుబ్బారావు కనుగొన్న పరిశోధనలను వెలుగు చూడనీయక పోవడంతో సుబ్బారావు కనుగొన్న ‘‘న్యూక్లియో టైడ్లన్’’ ను ఇతర పరిశోధనలతో కొన్ని సంవత్సరాల
తరువాత కనుగొన వలసి వచ్చింది.
కొత్తగా కనుగొనిన శిలీంద్రానికి (ఫంగస్) సుబ్బారావు గౌరవార్థం ‘‘Subba Rao Myces Splendence అని పేరు పెట్టారు. 1947 సంవత్సరంలో అమెరికా పౌరసత్వం లభించినా, ఆయన భారత పౌరునిగానే ఉండిపోయారు.