header

Rani Ahalya Bai

రాణి అహల్యాబాయి
rani ahalya bai భారతదేశాన్ని పరిపాలించిన ఉత్తమ పాలకులలో రాణి అహల్యాబాయి ఒకరు. అహల్యా బాయి హోల్కర్, 1725వ సంవత్సరం ఔరంగాబాద్ జిల్లా చౌండి గ్రామంలో జన్మించింది. తండ్రి మంకోజీ షిండే ఆగ్రామానికి పటేల్. అహల్యా బాయికి 1735వ సంవత్సరంలో తన పదవ ఏట మరాఠా సర్దార్లలో ప్రముఖుడైన మల్హర్ రావ్ హోల్కర్ ఏకైక కుమారుడు ఖండే రావు హోల్కర్ తో వివాహం జరుగుతుంది.ఇతనికి అన్నిరకాల వ్యసనాలుండేవి.
మరాఠా సర్దార్ మల్హర్ రావ్ ఇండోర్ పాలకుడిగా పేరుపొందాడు. ఇతని కుమారుడు ఖండే రావు దురదృష్టవశాత్తు 1754వ సంవత్సరం కుంభేర్ కోట ముట్టడి సమయంలో మృతిచెందుతాడు. సతీ సహగమనానికి పాల్పడబోయిన అహల్యా బాయిని మామ మల్హర్ రావ్ ఆపుతాడు అహల్యా బాయి కి యుధ్ధవిద్యలలో మరియు రాజనీతి, పరిపాలన తదితర అంశాలపై తర్ఫీదునిచ్చాడు. 1766వ సంవత్సరంలో మల్హర్ రావ్ మరియు 1767వ సంవత్సరంలో అహల్యా బాయి ఏకైక కుమారుడు మాళోజీ రావు మృతి చెందడంతో ఇండోర్ పాలనా బాధ్యతలు అహల్యా బాయి చేపడుతుంది. అప్పటినుండి సుమారు మూదు దశాబ్దాలపాటు పరిపాలించి ఇండోర్ ను ఒకపెద్దపట్టణంగా, వ్యాపారకేంద్రంగా మార్చింది.
. ఆమె రాజ్యాన్ని థగ్గులనే ప్రఖ్యాత దోపిడీదారుల నుంచి, ఇతర దుండగుల నుంచి రక్షించే ప్రయత్నాలు చేశారు. ఆమె యుద్ధాలలోకి వ్యక్తిగతంగా సైన్యాన్ని నాయకత్వం ముందుకు నడిపారు. తుకోజీరావ్ హోల్కర్‌ను సేనానాయకునిగా నియమించారు.
అహల్యాబాయి గొప్ప దైవభక్తురాలు, ధార్మికరాలు. ఇండోర్, మహేశ్వర్ ప్రాంతాల్లో అనేక హిందూ ఆలయాలను నిర్మింపజేసింది.. ఆమె రాజ్యాలకు ఆవల ఉన్న అనేక పవిత్ర స్థలాల్లో ధర్మశాలలు నిర్మించారు. వాటిలో తూర్పున ద్వారక (గుజరాత్) నుంచి మొదలుకొని వారణాసి, ఉజ్జయిని, నాసిక్, గయ, వైద్యనాథ్ ఆలయం (మహారాష్ట్ర) వంటి ప్రాంతాల్లో ధర్మశాలలు నిర్మాణం చేయించారు. సోమనాథ్‌లో పాడుబడి, అపవిత్రమైవున్న ప్రఖ్యాత సోమనాథేశ్వరాలయాన్ని ఆమె పునర్నిర్మించారు.
ఒక స్త్రీ పాలనా బాధ్యతలు చేపట్టడంపట్ల రఘోబా వంటి మరాఠా సర్దార్లు అభ్యంతరమం చెప్పినప్పటికీ , నాటి పీష్వా మాధవ రావు అండతో ఆమె ఇండోర్ పాలనా బాధ్యతలు చేపట్టారు. 1767వ సంవత్సరం నుండి 1795వ సంవత్సరం వరకు ఆమె ఇండోర్ రాజ్యాన్ని పరిపాలించారు. ఆమె పర్దా పధ్ధతిని(ఘోషా) పాటించలేదు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేవారు. తుకోజీ హొల్కర్ ను సుబేదార్ గా నియమించారు. సామంత నాయకులు అమెకెంతో గౌరవమిచ్చేవారు. ఇండోర్ని విస్తరింపచేశారు. రాజధానిని నర్మదా నది ఒడ్డున కొత్తగా నిర్మించిన మహేశ్వర్ కి మార్చారు . మధ్యభారత మాళ్వా ప్రాంతాన్ని మహేశ్వర్ రాజధానిగా శాంతి సౌభాగ్యాలతో పరిపాలించారు . యుధ్ధవిద్యలలో స్త్రీలను ప్రోత్సహించి ఒక మహిళా సేనను ఏర్పరిచారు సంక్రమించేలా చేశారు. వితంతువులకు భర్త ఆస్తి . కాలువలు , చెరువులు త్రవ్వించి వ్యవసాయ అభివృధ్ధికి పాటుపడ్డారు
పరిపాలనా సమయంలో అహల్యా బాయి సేవకు, దానధర్మాలకు మారుపేరుగా నిలిచారు. ఆమె శివుని భక్తురాలు . మధ్యభారత మాళ్వా ప్రాంతాంలోనే కాక భారతదేశమంతటా శివాలయాలు నిర్మించారు. మహమ్మదీయుల దాడులలో శిథిలమైన అనేక ఆలయాలను పునర్నిమించార . కాశీ, ద్వారక, మథుర, ఉజ్జయిణి, రామేశ్వరం, అయోధ్య, హరిద్వార్ ఇలా అనేక పుణ్యక్షేత్రాలలోని అలయాలను పునరుద్ధరించారు. ఆ విధంగా హిందూ ధర్మ పునరుత్తేజానికి కృషి చేశారు.
మహేశ్వరం నేత కార్మికులను ప్రోత్సహించి మహేశ్వరం అను కొత్తనేత చీరలను అందుబాటులోకి తెచ్చారు. అవి నేడు దేశవ్యాప్తంగానే కాక ప్రపంచవ్యాప్తంగా పేరుపొందినవి.
కూతుకు ముక్తాబాయి కొడుకు సత్ధూని పెంచి అతనని తన వారసుడిగా చేయాలనుకుంటుంది. కానీ సత్ధూని అంతుబట్టని వ్యాధి కబళిస్తుంది. ఈ బెంగతో అల్లుడు మరణిస్తాడు. కూతరు సతీసహగమనం చేస్తుంది. అహల్యాబాయి జీవితంలో అన్నీ విషాదాలే. అహల్వాబాయి భగవంతుని నామస్మరణచేస్తూ 1795 ఆగష్టు 13వ తేదీన మరణించింది