అమృతా ప్రీతం భారతదేశపు సుప్రసిద్ద రచయిత్రి. ఈమె 1919 సంవత్సరంలో పంజాబ్ లోని గుర్జాన్ వాలా అనే గ్రామంలో జన్మించింది. (ఇది ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉంది) పంజాబీ భాషలో రచనలు చేసిన మొదటి మహిళా రచయిత్రిగా కొనియాడబడింది. దాదాపు వందకు పైగా రచనలు చేసింది. వీటిలో కవితలు, కథలు, జీవితచరిత్రలు, పంజాబ్ జానపద గేయాలు మొదలగునవి ఉన్నాయి.
1935లో లాహోర్ కు చెందిన ప్రీతమ్ అనే వ్యక్తితో అమృతాకు వివాహం జరుగుతుంది. కానీ వీరు 1960వ సంత్సరంలో విడిపోవడం జరుగుతుంది.
1983లో అత్యున్నత సాహితీ పురస్కారమైన జ్ఞానపీఠ పురస్కారమును పొందిన మొదటి మహిళా రచయిత ఈవిడ. ఇంచుమించు సగం ప్రపంచాన్ని చుట్టివచ్చింది. భారత ప్రభుత్వం ఈమెకు 1969 లో పద్మశ్రీ బిరుదం ఇచ్చి గౌరవించింది
ఈమె రచనలలో ప్రముఖమైనది 1950లో రాసిన పింజర్. ఈ నవలను ఊర్మిళా మందోద్కర్ నాయకి గా హిందీలో తెరకెక్కించారు. ఈ సినిమా పలు జాతీయ పురస్కారాలు పొందినది.1986, 1992 సంవత్సరాలలో రాజ్యసభ సభ్యురాలుగా రెండు పర్యాయాలు నామినేట్ చేయబడింది 2004 లో భారతదేశంలో రెండవ అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ ను అందుకుంది.
2005 సంవత్సరం అక్టోబర్ 31వ తేదీన ఢిల్లీలో తన 86వ ఏట నిద్రలోనే పరమపదించినది.