header

Aswani Nachappa

అశ్వనీ నాచప్ప
aswani nachappa అశ్వనీ నాచప్ప భారతీయ క్రీడాకారిణి. మహిళల పరుగుపందెములో 1980వ దశకపు ప్రధమార్ధంలో పి.టి.ఉషను ఓడించి భారతీయ ఫ్లోజోగా పేరు తెచ్చుకున్నది. ఈమెకు 1988లో అర్జున అవార్డు ప్రదానం చేయబడింది.నాచప్ప జన్మస్థలం కర్ణాటక రాష్ట్రం కూర్గ్ . నాచప్ప క్రీడా రంగము నుండి తొలిన తర్వాత 1994 అక్టోబర్ 2 న ఇండియన్ ఏయిర్‌లైన్స్ జట్టు హాకీ ఆటగాడు దత్త కరుంబయ్యను వివాహము చేసుకొంది. వీరికి అనీషా, దీపాలీ కుమార్తెలు నాచప్ప హీరోయిన్ గా రెండు తెలుగు సినిమాలు వచ్చాయి.. సీఎస్‌ఐ పేరుతో ఒక సంస్థను ఆరంభించింది. మెరికల్లాంటి సుశిక్షితులయిన క్రీడాకారులను తీర్చిదిద్దుతూనే... క్రీడా రంగంలో మహిళల వేధింపులకు... నానాటికీ పెచ్చుమీరుతోన్న అవినీతి పోకడలకు వ్యతిరేకంగా గళం విప్పింది. ప్రముఖ క్రీడాకారులను కూడగట్టి ఉద్యమం బాట పట్టింది. మైదానంలో అశ్విని ఒక సంచలనం.. పరుగుల బరిలో, మెరుపు వేగంతో చిరుతపులిలా ఆమె లక్ష్యాన్ని అధిగమించే తీరు క్రీడాభిమానుల మనసుల్లో చెరగని ముద్ర వేస్తుంది. చిరస్మరణీయమైన విజయాలు సాధించిన అశ్వని పదేళ్ల క్రితమే క్రీడారంగం నుండి వైదొలగింది నేను కొడగు జిల్లాలోని గోణికొప్ప అనే చిన్న గ్రామంలో పెరిగాను. అక్కడ విద్య, ఆరోగ్య వసతుల్లేవు. అక్కడ ఉంటూ పల్లె ప్రజలకు సేవ చేయాలనుకున్నా. అందుకే అక్కడ ఓ స్కూలు ఆరంభించా. పాఠాలతో పాటూ... ఆటల్లోనూ శిక్షణనిస్తున్నా' అని చెప్పుకొచ్చింది. అశ్విని నిర్వహిస్తున్న పాఠశాలలో అరవై శాతం స్థానికులకే చదువుకునే అవకాశం. ప్రస్తుతం 560 మంది విద్యార్థులు అక్కడ చదువుకొంటున్నారు. రాజకీయ నాయకుల ప్రమేయాన్ని తగ్గించి క్రీడా సంఘాల నాయకత్వ బాధ్యతలని క్రీడాకారులకే అప్పగించాలి అంటున్నారుఆమె తన ఇద్దరమ్మాయిల క్రీడాసక్తుల్ని గమనించి వారికి క్రీడలలో శిక్షణ ఇస్తున్నారు. పెద్ద కూతురు అమీషా రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి. రెండో కుమార్తె దీపాలి గోల్ఫ్‌ క్రీడాకారిణి.