header

Chakali Ilamma

వీరనారి ఐలమ్మ
chakali ilamma ఐలమ్మ నేటి తెలంగాణాలోని విసునూరు గ్రామానికి దగ్గరలో ఉన్న పాలకుర్తి గ్రామానికి చెందినది. ఐలమ్మకు ఇదే గ్రామానికి చెందిన నర్సయ్యతో 14సంవత్సరాల వయస్సులో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కొడుకులు. సోమయ్య,
పెళ్లిజరిగిన తరువాత భర్త వృత్తినే చేపట్టింది. భర్త ఇంటిపేరు చిట్యాల. కానీ ఈమెను చాకలి ఐలమ్మ అని పిలిచేవారు. ఐలమ్మ కొంత పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తుంది. వ్యవసాయంలో మెలకువలన్నీ తెలుసుకుని మంచి ఫలసాయాన్ని సాధిస్తుంది. సొంత ఇల్లు సంపాదించుకుంటుంది.
ఆకాలంలో తెలంగాణాలోని గ్రామాలు దేశ్ ముఖ్ ల పాలనలో ఉండేవి. పాలకుర్తి గ్రామం కూడా విసునూరు రామచంద్రారెడ్డి అనే దేశముఖ్ ఆధీనంలోనే ఉండేది. దేశ్ ముఖ్ ల ఆగడాలకు అంతు ఉండేది కాదు. ఇతను ఐలమ్మ సాగుచేస్తున్న పొలం తనదని దొంగపత్రాలు తయారుచేసి పొలం స్వాధీనం చేసుకుంటానికి రజాకార్లతో కలసి వస్తాడు. కానీ ఐలమ్మజనం సాయంతో తిప్పికొడుతుంది. అప్పటినుండి ఈ దేశ్ ముఖ్ ఐలమ్మమీద పగపడతాడు. ఐలమ్మ విప్లవకారులకు ఆశ్రయమిస్తుంది. తానుకూడా రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటంలో పాల్గొంటుంది. అనేక వేల ఎకరాల పొలంను పేదవారికి చెందేటట్లు చేస్తుంది.
ఆంధ్ర మహాసభల ముఖ్యనాయకుడైన ఆరుట్ల రామచంద్రారెడ్డి 1945ఫిబ్రవరి పాలకుర్తి జాతరలో మహా సభ సమావేశం పెట్టాలని నిర్ణయిస్తాడు. ఈ సందర్భంగా సభకు ఏర్పాట్లు చేస్తున్న ఐలమ్మ భర్త నర్సయ్యను, కొడుకును పోలీసులు చితకగొడతారు. ఈ దెబ్బలకు ఐలమ్మ భర్త నర్సయ్య మరణిస్తాడు. కానీ ఐలమ్మ దిగులు పడక మరింత చురుకుగా ఉద్యమాలలో పాల్గొంటుంది.
హైదరాబాద్ రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడే వరకు దాదాపు ఎనిమిదేళ్లు ఐలమ్మ జీవితం పోరాటంలో గడిపింది. ఆంధ్రమహాసభ నాయకత్వంలో ధైర్యంగా పోరాటం చేసింది. పోరాటంలో సర్వం కోల్పోతుంది.
స్వాతంత్ర్యానంతరం ఐలమ్మకు స్వాతంత్య్ర సమర యోధుల పింఛను కూడా రాలేదు ఆకాలంలో ఏ నాయకుడూ పట్టించుకోలేదు. అవసాన దశలో పేదరికంతో బాధ పడింది. మనుమరాలి ఇంట్లో శేష జీవితం గడిపింది. వీరనారి ఐలమ్మ 1985 సెప్టెంబర్ 10న చనిపోయింది