header

Kalpana Chawla

కల్పనా చావ్లా
కల్పనా చావ్లా ఒక ఇండియన్ -అమెరికన్ వ్యోమగామి మరియు వ్యొమనౌక యంత్ర నిపుణురాలు.
కల్పనా చావ్లా, భారత దేశంలో హర్యానా లోని కర్నాల్ అనే ఊరులో ఒక పంజాబీ కుటుంబంలో పుట్టారు. తల్లిదండ్రులకు సునీత, దీప, సంజయ్ ల తర్వాత ఈమె జన్మించారు. ఇంట్లో అందరూ ముద్దుగా "మోంటు" అని పిలుచుకుంటారు. తండ్రి బనారసీలాల్ చావ్లా సాధారణ వ్యాపారి. కల్పనపై ఆయన ప్రభావం ఎక్కువ. పేదరికం నుంచే ఆయన పైకెదిగారు. పట్టుదల, అందుకు తగిన కృషి ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించిన వ్యక్తి ఆయన. చిన్నగా టైర్ల వ్యాపారాన్ని ప్రారంభించిన ఆయన తొలుత ఎన్నో కష్టనష్టాలకు గురయ్యారు. అయినా దాన్ని వదలకుండా అనుకున్నది సాధించేందుకు ముందుకు సాగిపోయారు. అప్పటి వరకూ టైర్ల తయారీకి విదేశీ యంత్రాన్ని ఉపయోగించేవారు. ఆ క్రమంలో ఆయన దేశీయంగానే ఆ యంత్రాన్ని రూపొందించారు. బనారసీలాల్ శ్రమ ఫలించింది. రాష్ట్రపతి నుంచీ అభినందనలు అందుకున్నారు. తర్వాత ఆర్థికంగా నిలదొక్కుకున్నారు ఆడపిల్లే అయినా జీవితంలో ఏదో సాధించాలన్న తపన కల్పనలో ఉండటానికి తండ్రేకారణం. "పరిస్థితులు ఎలాగున్నా... కన్న కలల్ని నిజం చేసుకోవడమే అంతిమ లక్ష్యం అన్న మాటలు నా తండ్రి జీవితంలో నిజమయ్యాయి. ఫలితంగా అవే నాలోనూ జీర్ణించుకుకుపోయాయి. అందుకు నాన్నే కారణం." అంటూ తొలి అంతరిక్షయానం తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఆలోచనలు ఏ విధంగా ప్రభావితమయిందీ కల్పన వివరించారు.
కల్పనా చావ్లా ముందుగా, కర్నాల్ లో ఉన్న టాగోర్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. తోటి పిల్లలంతా కామిక్ పుస్తకాలు చదువుతూ .....బర్బీ బొమ్మల్లా అలంకరించుకునే వయసులో... ఆమె తెల్లవారు జామునే లేచి సైకిల్ పై స్కూలు కెళ్ళేవారు. స్కూల్లో డ్రాయింగ్ క్లాసులో విమానం బొమ్మలు గీయటానికి ఇష్టపడేవారు. ఈమె సోదరుడు సంజయ్ చావ్లా కమర్షియల్ పైలట్ కావాలని కలలు కనేవాడు. తన గదిలో విమానాల బొమ్మలుంచేవాడు. అవి కల్పనలో స్ఫూర్తిని కలిగించాయి. కల్పన తన కలల్ని నిజం చేసుకోవటానికి సోదరుడు సంజయ్ ప్రోత్సాహం ఎంతో ఉంది. ఇద్దరి కలలూ ఒకటే - ఆకాశంలో ఎగరడం. కర్నాల్ లోని టాగోర్ పాఠశాలలో ఈమె ప్రాథమిక విద్య సాగింది.
పంజాబ్ ఇంజరీరింగ్ కాలేజీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేశారు. . 1982 లో ఈమె అమెరికా వెళ్లి అక్కడ "ఏరోస్పేస్ ఇంజనీరింగ్"లో మాస్టర్ అఫ్ సైన్సు డిగ్రీని, అర్లింగ్టన్ లో ఉన్న టెక్సాస్ విశ్వవిద్యాలయం నుంచి 1984 లో పొందారు. 1986 లో చావ్లా రెండవ మాస్టర్ అఫ్ సైన్సు డిగ్రీని మరియు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో పిహెచ్ .డిని బౌల్డెర్ లో ఉన్న కోలోరాడో విశ్వవిద్యాలయం నుంచి పొందారు.అ
ందమైన భవిష్యత్ కోసం కలలు కంటూ గాలిలో మేడలు కట్టకుండా జీవిత లక్ష్యాన్ని సాధించుకున్న మహిళ కల్పనా చావ్లా. చదువులో ఎప్పుడూ ముందు ఉండేది. ఈమెను ఎక్స్‌ట్రావెర్ట్ గా ఉపాధ్యాయులు పేర్కొనేవారు. సహజంగా ఒక వ్యక్తి 20 నుండి 30 సంవత్సరాల మధ్య వయసులో కెరియర్ ను ప్రారంభించినా, అప్పటి నుంచి ఓ 15 ఏళ్ళు కష్టపడితే గాని పేరు రాదు. కానీ కల్పన పిన్నవయసులోనే గొప్ప వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. ఈమె నాసాలో ఉద్యోగానికి దరఖాస్తు చేసినపుడు ఈమెతో 2 వేల మంది పోటీ పడ్డారు. అయితే ఈమె మాత్రమే నాసా శాస్త్రవేత్తగా ఎంపికయ్యారు. తల్లిదండ్రులు సంప్రదాయవాదులే అయినా కొత్తను ఎప్పుడూ ఆహ్వానించేవారని అంటారీమె. తన కెరియర్ ను వారెప్పుడూ అడ్డుకోలేదనని, తాను కోరుకున్న దానికి ఆమోదం తెలిపేవారని అన్నారు.
1986 సంవత్సరం లో, NASA ఏమ్స్ పరిశోదనా కేంద్రంలో ఓవర్ సెట్ మెథడ్స్, ఇంక్.కి వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. చావ్లా విమానాలకు,గ్లైడర్లు లకు మరియు ఒకటి లేదా ఎక్కువ యంత్రాలు ఉండే విమానాలకు, వ్యాపార విమానాలకు శిక్షణ ఇచ్చే యోగ్యతాపత్రం కలిగి ఉన్నారు. ఆమె దగ్గర యఫ్సిసి జారీ చేసే టెక్నికల్ క్లాసు అమెచూర్ రేడియోఅనుమతి కాల్ సైన్ KD5ESI ఉంది. ఆమె 1983 లో విమానయాన శిక్షకుడు మరియు విమాన చోదక శాస్త్ర రచయిత ఐన జీన్-పియర్ హారిసన్ ను వివాహం చేసుకున్నారు, 1990 లో యునైటెడ్ స్టేట్స్ దేశ పౌరురాలిగా అయ్యారు.