header

Kiran Mazundar Shaw

కిరణ్ మజుందార్ షా
kiran mazundar shaw పరిచయం : భవిష్యత్తు బయోటెక్నాలజీ రంగానిదేననవి దాదాపు 40 సంవత్సరాల కిందటే గుర్తించిన దార్శనికురాలు కిరణ్ మజుందార్ షా. జీవశాస్త్ర పరిజ్ఞానానికి ఇంజనీరింగ్ వైపుణ్యాన్ని జోడించి భారతదేశంలో బయోటెక్నాలజీ పరిశ్రమను ప్రగతిపధంలో పరుగులు తీయించారామె. భారత బయోటెక్నాలజీ రంగంలో కిరణ్ మజుందార్ షా ఒక విజయకేతనం ఎగురవేశారు. ఎలాంటి వ్యాపార నేపథ్యం లేకున్నా, కేవలం మనోబలం, సంకల్పబలంతో ఉన్నత శిఖరాలకు చేరుకున్నది. లాభార్థనకే పరిమితం కాకుండా తన ఆస్తిలో సగభాగాన్ని సేవాకార్యక్రమాలకు కేటాయించిన వితరణశీలత అమెకే చెందింది.

కిరణ్ మజుందార్ షా 1858 మార్చి 28న బెంగళూరులో స్థిరపడ్డ సామాన్య గుజరాతీ కుటుంబంలో జన్మించారు. బెంగళూరు వర్సిటీ నుంచి 1978లో ఎస్సీ పూర్తి చేశారు. వైద్యవిద్య చదవాలనుకున్నా స్కాలర్ షిప్ రాకపోవడంతో కుదరలేదు. కిరణ్ తండ్రి రాసేంద్ర మజుందార్ యునైటెడ్ బ్రూవరీస్లో ప్రధాన బ్రూ మాస్టర్ గా పనిచేసే వారు ఆయన సలహాపై అస్త్రీలియాలోని బాలా బ్రూయింగ్ (మద్యం తయారీ) కోర్సులో చేరారు. బ్రూయింగ్ చదువు పూర్తయ్యాక 1975లో భారత్ కు తిరిగి వచ్చినా ఆమెనెవరూ ఉద్యోగంలోకి తీసుకోలేదు ఆడపిల్ల మద్యం తయారు చేయడమేంటని పెదవి విరిచారు
బయోకాన్ పరిశ్రమను కేలం 10 వేల రూపాల పెట్టుబడితో ప్రారంభించారు. బ్రూయింగ్ రంగంలో ఉద్యోగంపై ఆశలు వదిలేసుకున్న తరుణంలో ఐర్లాండ్ కు చెందిన బయోరాన్ బయోకెమికల్ కంపెనీ వ్యవస్థాపకుడు లెస్లీ ఆకిన్ క్లోసీ రూపంలో కిరణ్ కు అనుకోని అవకాశం లభించింది. లెస్లే తమ కంపెనీకి బారతదేశంలో భాగస్వామి కోసం అన్వేషిస్తున్న సమయంలో ఆయనకు కిరణ్ తారసపడ్డారు. ఇద్దరికీ ఒప్పందం కుదరడంతో ఒక అద్దె ఇంట్లోని కారు గ్యారేజీలో బయోకాన్ సంస్థను
ప్రారంభించారు. రుణం కోసం బ్యాంకులను సంప్రదిస్తే బయోటె క్నాలజీనా? ఇంతవరకు ఆ పేరే వినలేదే అంటూ బ్యాంకు అధికారులు పెదవి విరిచేవారు. చివరకు తండ్రి పూచీకత్తు మీద రుణం మంజూరైంది పేద దేశాల మార్కెట్ పైన గురిపెట్టి పేద దేశాల మార్కెట్ పైనే కిరణ్ వ్యూహాత్మకంగా దృష్టి సారించారు. పేటెంట్ గడువు ముగిసిన ఔషధాలను వివిధ రూపాల్లోకి మార్చి కొత్త ఔషధాలను తయారు చేయటం కంపెనీలతో వ్యూహాత్మకంగా దీర్ఘకాలిక ఒప్పందాలు కుదుర్చుకోవటం కంపెనీకి లాభించింది కొలెస్ట్రాల్ ను నిరోధించే స్టాటిన్స్ కు మర్కెట్ లో గిరాకీ ఉంది.
దీనిపై లోవాస్టీన్ కంపెనీకి ఉన్న పేటెంట్ గడువు 2001లో తీరిపోవటంతో బయోకాన్ స్టాటిన్స్ ఉత్పత్తులను మార్కెట్లోకి తెచ్చింది. వ్యాపార విస్తరణపై దృష్టి సారించిన కిరణ్. వివిధ వ్యాధుల నివారణకు వాడే జీవఔషధాల తయారీ కోసం 1994లో సింజెనే, 2004లో క్రింజనే పేరిట అనుబంధ కంపెనీలను ఏర్పాటు చేశారు "ఇన్ఫోసిస్' నారాయణమూర్తి సలహాపై 2004లో కిరణ్ తన కంపెనీని స్టాక్ మార్కెట్లో నమోదు చేశారు. భారత్లో తొలి కేన్సర్ ఔషధాన్ని 2008లో విడుదల చేసిన ఘనత బయోకాన్ కు దక్కుతుంది అద్దె ఇంటి గ్యారేజ్ లో ప్రారంభమైన బయోకాన్ ఈనాడు బెంగుళూరు దగ్గరలోని హోసూరులో 80 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఏర్పాటు చేయబడ్డది. బారత బయోటెక్నాలజీ రంగంలో బయోకాన్ అతిపెద్ద సంస్థగా అవతరించింది కిరణ్ రూ.8 వేల కోట్లకు పైగా సంపదతో సంపన్న భారతీయుల జాబితాలో నాలుగో స్థానాన్ని సంపాదించారు.
వ్యాపార విజయాలు కిరణ్ మజుందార్ షాకు అనేక సత్కారాలను పురస్కారాలను తెచ్చిపెట్టాయి. భారత ప్రభుత్వ ఆమెను ‘‘పద్మశ్రీ’’ ‘‘పద్మభూషణ్’’ అవార్డులతో సత్కరించింది. అమెరికాకు చెందిన కెమికల్ కెమికల్ హెరిటేజ్ ఫౌండేషన్ ఆమెకు ఓధ్మర్ గోల్డ్ మెడల్ పురస్కారాన్ని బహూకరించింది.
సాధారణంగా ఇవన్నీ వ్యాపారవర్గాలలో చాలామంది పేరున్నవారు సాధిస్తారు. కానీ కిరణ్ తన ఆస్తిలో సగభాగాన్ని బీదవారిని ఆదుకోవడానికే కేటాయించారు. మారుమూల గ్రామాల్లోని ప్రజలకు నత్వర వైద్యసేవల కోసం 220 కోట్లతొ ఇరాజ్ రోగనిర్ధారణ కేంద్రా లను నిర్వహిస్తున్నారు. బెంగళూరులో 1400 పడకల కేన్సర్ ఆస్పత్రిని నిర్మించారు. వరద బాధితులకు మూడువేల ఇళ్లు కట్టించారు. కంపెనీ నిర్వహణకు సంసారం ప్రతిబంధకమవుతుందని భావించి చాలాకాలం పెళ్లికి దూరంగా ఉన్నారు. అయితే, 1998లో స్కాట్లాండ్ కు చెందిన జాన్ షాను ప్రేమించి పెళ్లాడారు.
ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం వల్ల మాతృత్వానికి దూరమైన కిరణ్ బయోకాన్ నే తన బిడ్డగా భావిస్తారు.