కిత్తూరు చెన్నమ్మ కన్నడదేశానికి చెందిన కిత్తూరు అనే చిన్నరాజ్యానికి రాణి అప్పటికి భారతదేశం బ్రిటిషు ఈస్టు ఇండియా కంపెని వారి అధికారంలో ఉంటుంది.
చెన్నమ్మ క్రీ.శ.1778 లో అక్టోబరు 23వ తేదిన బెల్గాంకు(కర్నాటక) 5 కి.మీ.దూరంలో ఉన్న కిత్తూరుకి చెందిన కాకతి అనే గ్రామంలో జన్మించింది.. చెన్నమ్మ చిన్నతనముననే గుర్రపుస్వారి, విలువిద్యలలో శిక్షణపొంది, యుద్ధవిద్యలలో ఆరితేరినది. చెన్నమ్మ తండ్రి కాకతీయ దేశాయి కుటుంబానికి చెందిన ధూళప్పగౌడరు.
మధ్యప్రదేశ్ లోని ఝాన్సికి చెందిన లక్ష్మీబాయి కన్న 56 సంవత్సరముల ముందే పుట్టి, తన రాజ్య స్వాతంత్ర్యం కొరకు బ్రిటీషు కంపెనీతో యుద్ధం చేసిన మొదటి భారతీయ వీరవనిత.
చెన్నమ్మ వివాహము కిత్తూరు పాలకుడయిన దేశాయిరాజ కుటుంబీకుడైన మల్ల సర్జన తో జరుగుతిం, కిత్తూరు రాజ్యానికి రాణి అవుతుంది. చెన్నమ్మ మల్లసర్జనకు రెండవ భార్య. చెన్నమ్మ, మల్లసర్జన్న దంపతులకు ఒక కుమారుడు జన్మిస్తాడు. కానీ ఈకుమారుడు అనారోగ్యంచే చనిపోతాడు. చెన్నమ్మ శివలింగరుద్రప్ప అనే బాలుకుడిని కుమారునిగా దత్తత తీసుకున్నది. అతనిని తన వారసునికిగా ప్రకటిస్తుంది. కొంతకాలానికి మల్లసర్జన్న మరణిస్తాడు.
చెన్నమ్మ, మల్లసర్జనల దత్తపుత్రుడు శివలింగ సర్జను టిప్పుసుల్తాను నుండి రక్షణకై బ్రిటిషు ఇండియాతో ఒడంబడిక చేసుకుంటుంది. సంవత్సరానికి 1, 70, 000 రూపాయల కప్పం చెల్లించుటకు ఒప్పందంతో వీరి ఒప్పందం 1824 వరకు కొనసాగింది .
`11 సెప్టెంబరు 1824లో శివలింగ రుద్రసర్జను వారసుడు లేకుండగానే మరణిస్తాడు. అతని మరణసమయానికి అతని భార్య వీరమ్మ వయస్సు 11 సంవత్సరాలు. మరణించుటకు ముందే మాస్తమరడి గౌడర కుమారుడు శివలింగప్పను దత్తత తీసికొనడం జరిగింది. దీనిని అదునుగా తీసికొని అప్పటి ధారవాడ కలెక్టరు థ్యాకరె ఈ దత్తతను నిరాకరించి, 13 సెప్టెంబరు1824 న కిత్తూరు వచ్చి, మల్లప్పసెట్టి, మరియు హవేరి వెంకటరావులను అధికారులుగా నియమించి, ధనకోశముకు తాళము వేసాడు. దీనిని చెన్నమ్మ ఎదిరిస్తుంది. ఈ విషయమై చెన్నమ్మ థ్యాకరెకు, మన్రోకు, చాప్లినుకు విన్నపము చేస్తుంది, శివగంగప్ప వారసత్వాన్ని అంగీకరించి పాలనాధికార మిప్పించమని. కాని వారు నిరాకరించగా సమీపమున ఉన్న కోలాపుర సంస్థానంతో మరొయు బ్రిటీష్ వారి వ్యతిరేకులతో సంప్రదింపులు జరుపుతుంది సహకారం కోసం.
ధారవాడ కలెక్టరు సైన్యసమేతంగా 21 అక్టోబరు 1824 న కిత్తూరువచ్చి యుద్ధము ప్రకటిస్తాడు, ఫిరంగులను పేల్చుటకు సిద్ధమవ్వగా, కోట ముఖద్వారం తెరుచుకొని బయటికివచ్చిన చెన్నమ్మ సైన్యం ఒక్కుమ్మడిగా బ్రిటిషు సైన్యంపై గురుసిద్దప్పఅను సైన్యాధిపతి నేత్రుత్వంలో శత్రుసైన్యంపై ఊపిరిసల్పనివ్వకుండ దాడిచేసింది. చెన్నమ్మ అంగరక్షకుని తుపాకి గుండుకు కలెక్టరు మరణించగా. స్టివెన్ సన్ , మరియు ఈలియట్ అను బ్రిటిషువాళ్లు బందీలుగా చిక్కారు. దేశద్రోహనికి ఒడికట్టి, బ్రిటిషువారికి సహకరించిన కన్నూరు వీరప్ప మరియు సరదార మల్లప్ప కిత్తూరు సైన్యంచేతిలో ప్రాణాలు పోగొట్టుకుంటారు. బ్రిటిషువారు కుటిలనీతితో ఒప్పందంకు వచ్చినట్లు నటించి, బందీలైన తమ ఇద్దరు బ్రిటిషు అధికారులను1824, డిసెంబరు2న విడిపించుకొని వెళతారు.
అయితే మాట తప్పి, బ్రిటిషువారు మళ్లీ డిసెంబరు 3 వ తేదిన అపారసైన్యంతో కిత్తూరు మీద దాడి చేస్తారు. ఫిరంగులతో కోటగోడలను బద్దలుకోట్టిలోనికి ప్రవేశిస్తారు. కిత్తూరు సైన్యం వీరోచితంగా పోరాడినను చివరకు లొంగిపోక తప్పలేదు. చివరకు డిసెంబరు 5, 1824 న చెన్నమ్మ, తన కోడలైన వీరమ్మ, జానకిబాయిలతోపాటు బ్రిటిషువారికి బందీగా చిక్కుతుంది. వీరిని బందీలుగా బైలహొంగలకు తీసుకెళ్తారు బ్రిటిషు వారు. చెన్నమ్మ 4 సంవత్సరాలు బైలహొంగలలో ఖైదీగా ఉండి ఫిబ్రవరి 2, 1829 న స్వర్గస్థురాలైనది.
రాణి కిత్తూరు చెన్నమ్మ గౌరవార్థం ఈమె విగ్రహం పార్లమెంటు ప్రాంగణములో, క్రీ.శ. 2007, సెప్టెంబరు 1న అప్పటి భారత ప్రథమ మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చే ఆవిష్కరింపబడినది.
రాణి కిత్తూరు చెన్నమ్మ మరణాంతరము, ఆమె సమాధిని బైలహొంగలలో నిర్మించారు. కాని సరియైన పర్యవేక్షణ లేనందున
సమాధి శిధిలస్థితికి చేరినది