

 
కోనేరు హంపి  భారతదేశంలో పేరుపొందిన మహిళా  చదరంగ క్రీడాకారిణి. 
హంపి  1987, మార్చి 31న ఆంధ్రప్రదేశ్ లోని గుడివాడలో జన్మించినది.
 కోనేరు 2007 అక్టోబర్ లో ఫైడ్ ఎలో రేటింగ్ లో 2600 పాయింట్లను దాటి మహిళా చదరంగంలో జూడిత్ పోల్గర్ తర్వాత ప్రపంచంలో రెండో స్థానంలో నిల్చింది. 
కేవలం 15 సంవత్సరాల వయసులోనే గ్రాండ్ మాస్టర్ హోదా 
 సంపాదించిన భారతదేశపు తొలి చెస్ క్రీడాకారిణి హంపి. 2001లో హంపి ప్రపంచ జూనియర్ బాలికల చెస్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది. 
ఐదు సంవత్సరాల పిన్న వయసులోనే తన తండ్రి కోనేరు అశోక్ ద్వారా హంపికి చదరంగం ఆట పరిచయమైయింది. 1995లో 8 సంవత్సరాలలోపు వారికి నిర్వహించిన జాతీయ చదరంగం పోటీలో హంపి నాలుగవ స్థానం కైవసం చేసుకోగానే, అశోక్ తన వృత్తికి రాజీనామా చేసి హంపికి పూర్తి స్థాయి శిక్షకుడిగా మారిపోయాడు. ఆ తరువాత 1998లో 10 సంవత్సరాలలోపు వారికి నిర్వహించిన జాతీయ చదరంగం పోటీలో హంపి స్వర్ణపతకం సాధించి, వివిధ వాణిజ్య సంస్థలనుండి ఆర్థిక ప్రోత్సాహకాలను అందుకుంది. 
2003లో చదరంగం ఆటలో అర్జున అవార్డును హంపి కైవసం చేసుకుంది. 
చదరంగం ఆటలో హంపి చూపించిన విశేష ప్రతిభకు గుర్తింపుగా 2007లో భారతదేశ ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ఇచ్చి సత్కరించింది. 
2008లో ఈమెకు శ్రీ రాజా లక్ష్మీ పురస్కారం లభించింది.