header

Mahasweta DFevi

మహా శ్వేతాదేవి
mahasweta devi మహా శ్వేతాదేవి పశ్ఛిమ బెంగాల్ కు చెందిన సుప్రసిద్ధ నవలా రచయిత మరియు సామాజిక కార్యకర్త.
ఆమె 1926లో ఢాకాలో జన్మించింది (ప్రస్తుత బంగ్లాదేశ్ రాజధాని). ఆమె తండ్రి మనిష్ ఘటక్ కూడా కవి మరియు నవలా రచయిత. తల్లి ధరిత్రి దేవి కూడా రచయిత మరియు సామాజిక కార్యకర్త. ఈమె విద్యాభ్యాసం ఢాకాలోనే కొనసాగింది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత జరిగిన దేశ విభజన సమయంలో కుటుంబం పశ్చిమ బెంగాల్‌ కు వస్తుంది. ఆ తరువాత రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన శాంతి నికేతన్ లోని విశ్వభారతి విశ్వవిద్యాలయంములోఆంగ్లంలో డిగ్రీ, కోల్‌కత విశ్వవిద్యాలయము నుంచి ఆంగ్లంలో ఎం.ఏ. పూర్తిచేసింది. నటుడు బిజన్ భట్టాచార్యను వివాహం చేసుకుంది.
మహాశ్వేతాదేవి ఎతోవా అనే గిరిజన బాలుడు జీవితంలో ఎలా విజయం సాధించాడన్న విషయంపై ‘ఎతోవా పోరాటం గెలిచాడు’. అనే నవల రచించారు. ఈ నవలను తెలుగులోకి చల్లా రాధాకృష్ణమూర్తి గారిచే అనువదించబడింది. బాలలకు తేలిగ్గా అర్థమయ్యేలాగా ఈ రచన చేశారు. పిల్లలకు ఆసక్తి కలిగించేవిధంగా పుస్తకంలో చక్కని చాయాచిత్రాలతో రూపొందించారు. ఈ గ్రంథం వల్ల మన దేశంలోనే ఉంటూనే చాలామందికి తెలియని గిరిజనుల సంస్కృతి, వారి పోరాటాలు, జీవితంలో లక్ష్యాలు, వాటిని సాధించేందుకు వారు ఎంచుకోవాల్సిన కష్టభరిత ప్రయాణం వంటివి ఎన్నో తెలుసుకోవచ్చు
మహాశ్వేతాదేవికి వచ్చిన అవార్డులు
2006లో భారత ప్రభుత్వపు రెండో అత్యున్నత అవార్డు పద్మవిభూషణ్ అవార్డు లభించింది.
1997లో రామన్ మెగాసెసె అవార్డు స్వీకరించింది.
1996లో సాహిత్య రంగంలో అత్యున్నత అవార్డు జ్ఞానపీఠ అవార్డు లభించింది.
2016 సంవత్సరం జూలై 28, గురువారం రోజున 90 ఏళ్ల వయసులో తీవ్రమైన గుండెపోటుతో పరమపదించారు.