మల్లికా సారాభాయ్ సుప్రసిద్ధ భారతీయ నాట్యకళాకారిణి. ఈమె1954 మే నెల తొమ్మిదవ తేదీన గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జన్మించింది. ఈమె తండ్రి భారతీయ ప్రముఖ శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయ్. తల్లి మృణాళిని సారాభాయ్ ఈమె కూడా క్లాసికల్ డాన్సర్. మల్లికా సారాభాయ్ ఉన్నత విద్యావంతురాలు. యం.బి.ఏ చదివింది. ఈమె స్త్రీల సాధికారత కోరకు కృషిచేసింది.
ఈమె కూచిపూడి మరియు భరతనాట్యం నృత్య కళలలో ప్రావీణ్యత సంపాదించినది . కొన్ని హిందీ, గుజరాతీ, మళయాళం సినిమాలలో కూడా నటించింది. 1982లో బిపిన్ షాతో ఈమె వివాహం జరుగుతుంది. కానీ ఏడు సంవత్సరాల తరువాత వీరు విడాకులు తీసుకొని విడిపోతారు.