మేధా పాట్కర్ సామాజిక ఉద్యమకారిణి. నర్మదా బచావో ఉద్యమంతో ఈమె పేరు ప్రపంచవ్యాప్తంగా తెలిసింది.
మేధా పాట్కర్ డిసెంబరు 1, 1954 న ముంబాయిలో జన్మించింది. తల్లితండ్రులు ఇందు, వసంత కనోల్కర్. వీరు కూడా సామాజిక సేవా కార్యకర్తలు. టాటా సంస్థలో ఎం.ఏ.సోషల్ వర్క్, తరువాత 7 సంవత్సరాలు స్వచ్చంద సంస్థల్లో పనిచేసింది. భర్తతో సామరస్యంగా విడిపోయింది.
2014 ఎన్నికలలో ఈమె ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఈశాన్య ముంబయి లోక్ సభ స్థానానికి పోటీ చేసారు, కాని భారతీయ జనతా పార్టీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు.
మేధా పాట్కర్ పొందిన అవార్డులు
1991లో రైట్ లివ్లీహుడ్ అవార్డు లభించింది.
1999లో ఎం.ఏ.థామస్ జాతీయ మానవ హక్కుల అవార్డు పొందినది.