header

Molla

మొల్ల
molla ఆతుకూరి మొల్ల 15వ శతాబ్ధమునకు చెందిన కవయుత్రి.
తెలుగులో మొల్లరామాయణముగా ప్రసిద్ధి చెందిన ద్విపద రామాయణమును వ్రాసినది. ఈమె కుమ్మరి కుటుంబములో జన్మించినది. మొల్ల శైలి చాలా సరళమైనదని మరియు రమణీయమైనదని ప్రసిద్ధి.
ఈమె కడపజిల్లా గోపవరం ప్రాంతానికి చెందినది అంటారు. తరతరాలుగా జనం చెప్పుకునే మొల్లబండ గోపవరంలో ఉన్నది. గ్రామస్తులు ఈ బండకు పూజకూడా చేస్తారు. శ్రీకృష్ణదేవరాయలు ఈ గోపవరంలో బసచేసినట్లుగా స్థానికులు చెప్పుకుంటారు. మొల్ల పూర్వీకులు ఆత్మకూరు గ్రామానికి చెందివుంటారని అంటారు. మొల్ల నివసించిన ఇల్లుగా గోపవరంలో పాడుబడిన ఇల్లుకూడా ఉంది. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని పెద్దనకవి కూడా గోపవరం వచ్చినట్లు కొందరి వృద్ధుల కథనం.
మొల్ల స్వతంత్రభావాలు కలిగి ఉండేదని, చిన్నతనంలోనే తల్లిని కోల్పోగా తండ్రి కేశవ ఈమెను గారాబంగా పెంచాడని తెలుస్తుంది. ఈమెకు తండ్రి అంటే అమిత ఇష్టం. చివరిదాకా తండ్రి యొక్క ఇంటిపేరునే ఉపయోగించడం వలన మొల్ల పెళ్లి చేసుకోలేదని అంటారు. మొల్ల రామాయణము ఆరు కాండములలో 138 పద్యములతో ఉన్నది. ఈ కావ్యమును మొల్ల కేవలం ఐదురోజులలో వ్రాసినదని ప్రతీతి. మొల్ల రచన ఆనాటి పద్ధతికి విరుద్ధముగా వాడుకభాషకు దగ్గరలో ఉన్నది.