header

Mrunalini Sarabhi

మృణాళినీ సారభాయ్
mrinalini sarabhai మృణాలినీ కేరళ లోని మాజీ పార్లమెంట్ సభ్యులు మరియు సామాజిక కార్యకర్త అయిన "అమ్ము స్వామినాథన్" కుమార్తె. మే 11, 1918 న జన్మించింది. ఆమె తండ్రి డా.స్వామినాథన్ మద్రాసు హైకోర్టు లో పేరు పొందిన బారిష్టరు. మరియు మద్రాసు లాకాలేజ్ లో ప్రిన్సిపాల్ గా పనిచేసేవారు. అమె తల్లి "అమ్ము స్వామినాథన్" ప్రముఖ స్వాతంత్ర్యసమరయోధురాలు. ఆమె సోదరి డా. లక్ష్మీ సెహగల్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క "అజాద్ హిందు ఫౌజ్" లోని "రాణి ఆఫ్ ఝాన్సి రెజిమెంట్" విభాగానికి కమాండర్ గా ఉండేవారు.ఆమె సోదరుడు "గోవింద స్వామినాథన్" మద్రాసు హైకోర్టులో పేరుమోసిన న్యాయవాది. ఆయన మద్రాసు రాష్ట్రానికి అటార్నీ జనరల్ బాధ్యతలు కూడా నిర్వహించారు ఆమె బాల్యం స్విడ్జర్లాండ్ లో గడిచింది. ఆమె "డాల్‌క్రోజ్" పాఠశాలలో మొదటి పాఠాలను పశ్చిమాది నృత్య భంగిమలను నేర్చుకుంది. తరువాత శాంతి నికేతన్ లో రవీంధ్ర నాథ్ ఠాగూర్ మార్గదర్సకత్వంలో విద్యాభ్యాసం చేసింది. అక్కడ జివిత సత్యాలను గ్రహించింది. తర్వాత ఆమె కొంతకాలం యునైటెడ్ స్టేట్స్ కు వెళ్ళి అమెరికన్ అకాడమీ ఆఫ్ డ్రామాటిక్ ఆర్ట్స్ లో చేరింది. తర్వాత భారత దేశానికి వచ్చి ఆమె దక్షిణాది సాంప్రదాయక నృత్యం అయిన భరతనాట్యంను "మీనాక్షి సుందరంపిళ్ళై" ద్వారా మరియు "కథాకళి" నృత్యాన్ని నేర్చకున్నారు. మృణాలిని భారతీయ శాస్త్రవేత్త విక్రం సారాభాయ్ ను వివాహం చేసుకుంది. ఆయన భారతీయ అణుశాస్త్రవేత్త వీరికి ఒక కూమరుడు కార్తికేయ సారభాయ్ మరియు ఒక కుమార్తె మల్లికా సారభాయ్ ఉన్నారు. ఆమె కుమార్తె మల్లిక కూడా నృత్య కాళాకారిణి. . ఆమె చేసిన కళా సేవలకు గాను అనేక అవార్డులను పొందింది. ఈమె 18,000 మంది శిష్యులకు భరతనాట్యం మరియు కథాకళిలలో శిక్షణ నిచ్చింది. మృణాలిని 1948 లో దర్పన అనే సంస్థను స్థాపించింది. ఒక సంవత్సరం తరువాత పారిస్ లో "థియేటర్ నేషనల్ డి చైల్లోట్" లో ప్రదర్శననిచ్చి మంచి గుర్తింపు పొందారు. విక్రం సారభాయ్ ఆమె భార్యకు తన కెరీర్ ను పెంపొందించుకొనుటలో సంపూర్ణ స్వాతంత్ర్యం ఇచ్చాడు. వారు వివాహ జీవితం మాత్రం సమస్యలతో గడిపారు కారణం విక్రం సారభాయ్ వ్యక్తిగత జీవితాన్ని త్యాగంచేసి విజ్ఞానశాస్త్ర అభివృద్దికి పూర్తిగా అంకితమయిన వ్యక్తి కావటం వలనే ఆమె సుమారు మూడు వందలకు పైగా నాటకాలకు దర్శకత్వం వహించారు. ఆమె అనేక నవలలు, కవితలు, నాటకాలు మరియు కథలు పిల్లల కోసం వ్రాశారు. ఆమె గుజరాత్ రాష్ట్ర హాండీక్రాప్ట్స్ అండ్ హాండ్ లూం డెవలప్ మెంట్ సంస్థకు చైర్‌పర్సన్ గా కూడా ఉన్నారు. ఆమె సర్వోదయ ఇంటర్నేషనల్ ట్రస్ట్ కు ట్రస్టీగా కూడా ఉన్నారు. ఈ సంస్థ గాంధీ ఆశయాల ప్రోత్సాహం కోసం యేర్పడినది. ఆమె నెహ్రూ ఫౌండేషన్ డెవలెప్ మెంట్ కు చైర్‌పర్సన్ గా ఉన్నారు. ఆమె జీవిత చరిత్ర "మృణాలినీ సౌరభాయ్:ది వాయిస్ ఆఫ్ ద హర్ట్" . మృణాళినీ సారభాయి భారతదేశ విశిష్ట పురస్కారం‘‘ పద్మభూషణ ’’ అవార్డును 1992 లో అందుకున్నారు. 1997 లో యు.కె లోని న్యూయాచ్ కు చెందిన అంగిలియా విశ్వవిద్యాలయం ఆమెకు గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసింది. ప్రెంచ్ ఆర్చివ్స్ ఇంటర్నేషనలాలిస్ డి లా డాన్సె నుండి డిప్లొమా మరియు మెడల్ అందుకున్న మొదటి వ్యక్తిగా చరిత్రలో నిలిచారు. 1990 లో పారిస్ లోని ఇంటర్నేషనల్ డాన్స్ కౌన్సిల్ లో ఎగ్జిక్యూటివ్ కమిటీ లో నామినేట్ చేయబడినారు మరియు 1994 లో న్యూఢిల్లో లో సంగీత నాటక అకాడమీ పురస్కారాన్ని పొందారు. మెక్సికో ప్రభుత్వం నుండి బంగారు పతకాన్ని పొందారు. ఆమె స్థాపించిన దర్పణ అకాడమీ ఆఫ్ పెర్‌ఫార్మింగ్ ఆర్ట్స్ సంస్థ డిసెంబర్ 28,1998 న గోల్డెన్ జూబ్లీ వేడుకలను జరుపుకుంది. సాంప్రదాయక నృత్య రంగంలో "మృణాలినీ సారభాయ్ అవార్డ్ ఫర్ క్లాసికల్ ఎక్స లెన్స్" అవార్డును ప్రకటించారు జనవరి 21 2016న ఇన్‌ఫెక్షన్‌తో బాధ పడుతున్న మృణాళిని అహ్మదాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.