header

Muddupalani

ముద్దుపళని
ముద్దుపళని 18వ శతాబ్దమునకు చెందిన తెలుగు కవయిత్రి.
దేవదాసీల కుటుంబములో జన్మించింది తల్లి పోతిబోటి. తల్లి అమ్మమ్మలు కూడా కయుత్రులని తన రచనలలో పేర్కొంది. ఈమె తంజావూరు నేలిన మరాఠ నాయక వంశపు రాజు ప్రతాపసింహ యొక్క భోగపత్ని. ఈమె ప్రతాపసింహుని ఆస్థానములో నెల్లూరు శివరామకవితో పాటు ఆస్థాన కవయిత్రి కూడా. ముద్దుపళని యొక్క గురువు తిరుమల తాతాచార్యుల వంశమునకు చెందిన వీరరాఘవదేశికుడు.
అమ్మమ్మ తంజనాయకి కూడా కవియిత్రులని, తండ్రి పేరు ముత్యాలు అని రాధికా స్వాంతనముకు ఈమె రాసిన ప్రవేశికలో తెలుస్తున్నది.

ముద్దుపళని రాసిన రాధికాసాంత్వనము ఒక గొప్ప శృంగార ప్రబంధ కావ్యము. అలిగి కోపముతో ఉన్న రాధను కృష్ణుడు బుజ్జగించడము ఈ కావ్య ఇతివృత్తము. దీనికి యిళా దేవీయము అని కూడా పేరుకలదు. చిన్నికృష్ణునికి అకింతమైన ఈ గ్రంధములో నాలుగు భాగములలో 584 పద్యములు ఉన్నాయి. ముద్దుపళని యొక్క కవితా జాలమునకు ఒక మచ్చుకైన ఉదాహరణ
శౌరిని బిల్వగా జనిన చక్కని కీరమదేల రాదొయే
దారిని జన్నదో నడుమ దారెనో చేరెదొలేదొ గోపికా
జారుని గాంచెనోకనదొ చక్కగ నావెతవిన్నవించెనో
సారెకులేక శౌరినుడి చక్కెరయుక్కెఋఅ మెక్కిచిక్కెనో