![header](../../images/tk_title_003.jpg)
కన్నడ చరిత్రలో కిత్తురు చెన్నమ్మ (కిత్తూరు రాణి చెన్నమ్మ, బ్రిటీషు వారికి వ్యతిరేకంగా పోరాడిన వీరవనిత) తరువాత అంతగా గణతికెక్కిన మహిళ ఒబవ్వ.
ఒబవ్వ చిత్రదుర్గలోని ఒక కోట కాపలా భటుని భార్య. చిత్రదుర్గ పాలకుడు మదకరినాయకుడుకు హైదరిఆలికి (టిప్పుసుల్తాను తండ్రి) కి యుద్ధంజరుగుతున్న కాలంఅది. హైదర్‌ఆలి దాడిని మదుకర్ నాయక్ సమర్ధవంతంగా ఎదుర్కొంటాడు . ఏలాగైన సరే చిత్రదుర్గంను ఆక్రమించాలని హైదర్ ఆలి ప్రయత్నంచేస్తున్న రోజులవి. ఒకరోజు కాపలావిధిలో వున్న భర్తకు మధ్యాహన్న భోజనం తీసుకెళుతుంది ఒబవ్వ. ఆమె భర్త కాపలా స్దలానికి దగ్గరలోవున్న సత్రంలో భోజనంచేయటానికి కూర్చుంటాడు. భర్తకు నీళ్ళుతేవటానికి నీటి చెలమవద్దకు వెళ్ళుచున్న ఒబవ్వకు, రెండు బండ రాళ్ళ మధ్యనున్న సన్నని దారినుండి హైదర్‌ఆలి సైనికుడు లోపలికి రావడం గమనించినది.ఆ దారి నుండి ఒకసారి ఒకమనిషి మాత్రం అతికష్టంమీద రాగలడు. అప్పుడే భోజనంచేస్తున్న భర్తను భోజనంవద్ద నుండి లేపడం ధర్మంకాదని భావించిన ఒబవ్వ, తనకు అందుబాటులో వున్న రోకలిని అందుకుని ఆ దారి పక్కనే నిల్చుని, లోపలికి వస్తున్న ఆలీ సైనికుని తలమీద బలంగామోది, పక్కకు లాగివేసింది. ఆ కన్నంచాలా ఇరుకుగా వున్నందున ఇవతల జరుగుతున్నది అవతల వున్న సైనికులకు తెలిసే వీలులేదు. ఆవిధంగా ఒబవ్వ లోపలికి వస్తున్న ఒక్కొక్క భటుడుని రోకలితో తలమీదబాది చంపడం మొదలుపెట్టినది. భోజనం ముగించుకొనివచ్చిన ఒబవ్వ భర్తకు, వందలసంఖ్యలో గుట్టలుగా పడివున్న హైదర్‌సైనికుల శవాలమధ్య రోకలిపట్టుకుని వున్న ఒబవ్వ అపరకాళినే తలపించినది.ఆవిధంగా ఒకసామాన్యభటుని భార్య అయిన ఒబవ్వ వీర వనితగా నిలిచింది. ఇప్పటికి చిత్రదుర్గకు వచ్చే పర్యాటకులకు తప్పనిసరిగా ఈ ప్రదేశాన్ని చూసి, ఆమె వీరత్వాన్ని తలచుకుంటారు. రాయలసీమలోని చాలా మంది ఆడవారికి ఒబవ్వ, ఒబులమ్మ అనేపేర్లు ఉన్నాయి. కన్నడలో అవ్వ అనగా 'అమ్మ'ని అర్ధం.