తమిళనాడులోని మధుర రాజ్యానికి రాజైన విజయరంగ చొక్కనాధుని భార్య రాణి మీనాక్షి గొప్ప సాహసవంతురాలు, అందగత్తె.
శ్రీకృష్ణదేవరాయలు సేనాధిపతియైన నాగమనాయకుని కుమారుడు విశ్వనాథనాయకుడు 1529 సం.లో మధురకు రాజయ్యాడు. తరువాత అతని వంశంలో 11వ వాడైన విజయరంగ చొక్కనాధుని భార్య మీనాక్షి. ఈ దంపతులకు సంతానం లేదు. ఈ దిగులుతోనే చొక్కనాధుడు 1732 సం.లో మరణించాడు. మధురను సమర్దవంతంగా పాలించిటం మొదలు పెట్టింది.
తన రక్తసంభదీకుడైన వంగర తిరుమలయ్య కుమారుని దత్తత తీసుకుంది. కానీ కృతజ్ఞత లేని తిరుమలయ్య ఈమెకే ద్రోహం తలపెట్టాడు. మధుర సింహాసనం మీద అధికారం కోసం మొగలులతో కలసి కుట్రపన్నాడు. కానీ ఆర్కాట్ నవాబ్ చాంద్ సాహెబ్, తిరుమలయ్యనే మోసం చేసి ఇతనికి చెందిన దిండుగల్లు కోటను వశం చేసుకున్నాడు. తిరుమలయ్య కొడుకుతో సహా పారిపొయ్యాడు.
తరువాత మధుర రాజ్యం మీదకు దండెత్తి ఆ రాజ్యాన్ని వశం చేసుకున్నాడు.
ఇంటా, బయటా పొంచివున్న శత్రువుల మధ్య ఒంటరియైన మీనాక్షి 1736 లో జరిగి ఈ యుద్దంలో బందీగా చిక్కింది. ఒకనాడు రాణిగా వైభవాన్ని అనుభవించిన రాణి మీనాక్షి చీకటి కొట్టులో బంధించబడి సామాన్య ఖైదిగా మారింది.
ముస్లిం పాలకుల అరాచకాలు, కౄరత్యాన్ని గురించి తెలిసి రాణి మీనాక్షి ప్రాణాలతో ఉండి అవమానాలు భరించేకన్నా మరణమే మేలని తలచింది. విషం తెప్పించుకుని త్రాగి మరణించింది.
1529లో ఆంధ్రనాయక రాజ్యమైన మధురకు మొదటి రాజు విశ్వనాథనాయకుడు. చివరి రాణి మీనాక్షి. ఈమె పరిపాలన ఐదు సంవత్సరాలు మాత్రమే. ఈమెతోనే మధుర రాజ్యం అంతమయింది.