header

Sakuntala Devi

శకుంతలా దేవి
shkuntala devi శకుంతలా దేవి ప్రపంచ ప్రసిద్ధ గణిత, ఖగోళ మరియు జ్యోతిష శాస్త్రవేత్తఈమెను అందరూ మానవ గణన యంత్రము అని పిలుస్తారు. ఈమె ప్రపంచవ్యాప్తంగా అనేక గణితావధానములు నిర్వహించి గణన యంత్రము కంటే వేగంగా పలు సమస్యలను పరిష్కరించింది లెక్కలను చేయటలో గిన్నిస్ వరల్డ్ రికార్డును నెలకొల్పింది
శకుంతలా దేవి బెంగళూరు నగరంలో కన్నడ బ్రాహ్మణ కుటుంబంలో నవంబర్ 4, 1929 జన్మించారు. ఆమె తండ్రి ఒక సర్కస్ కంపెనీలో తాడుతో చేసే విన్యాసములు చేసే ఉద్యోగి.
1977లో అమెరికాలో ఓ కంప్యూటర్ తో శకుంతలా దేవికి పోటీ పెట్టారు. 188132517 అనే సంఖ్యకు మూడో వర్గం కనుక్కోవడంలో ఈ పోటీ పెట్టగా, ఆమె కంప్యూటర్ ను ఓడించగలిగారు. ఇక 1980 జూన్ నెలలో 13 అంకెలున్న రెండు సంఖ్యలు తీసుకున్నారు. 76,86,36,97,74,870 అనే సంఖ్యతో 24,65,09,97,45,779 అనే సంఖ్యను హెచ్చవేస్తే ఎంత వస్తుందని లండన్ ఇంపీరియల్ కాలేజిలోని కంప్యూటర్ విభాగంలోని ఓ సూపర్ కంప్యూటర్ శకుంతలా దేవిని ప్రశ్నించింది. దానికి ఆమె కేవలం 28 సెకన్లలో సమాధానం ఇచ్చారు. ఆ సమాధానం.. 18,947,668,177,995,426,462,773,730. ఆ దెబ్బకు గిన్నెస్ రికార్డు ఆమె సొంతమైంది. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన మానసిక శాస్త్ర ప్రొఫెసర్ ఆర్థర్ జెన్సెన్ స్వయంగా శకుంతలా దేవి గణిత ప్రతిభను పరిశీలించి ఆశ్ఛర్యపోయారు.
ఆరేళ్ల వయసులో తొలిసారి శకుంతలా దేవి మైసూరు విశ్వవిద్యాలయంలో తన గణిత ప్రతిభను బహిరంగంగా ప్రదర్శించారు. ఎనిమిదేళ్ల వయసులో అన్నామలై విశ్వవిద్యాలయంలో ఆమె ప్రదర్శనతో శకుంతలాదేవిని బాలమేధావిగా గుర్తించారు.గత శతాబ్ద కాలంలో ఏ తేదీ చెప్పినా అది ఏ వారం అవుతుందో చిటికెలో ఆమె చెప్పేవారు.
తన 83వ ఏట 2013 ఏప్రిల్ నెలలో గుండె, మూత్రపిండాల సమస్యలతో బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో కన్నుమూశారు.