వయోలిన్ తో కర్ణాటక సంగీతానికే వన్నె తెచ్చిన గొప్ప సంగీత విద్యాంసుడు. భారతదేశంలోనే కాకుండా దేశవిదేశాలలో ప్రేక్షకులను తన సంగీతంతో అలరించి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. సారంగి వాయిద్యంతో ఒంటరి కచేరీలు ఇవ్వడం వీరే ఆరంభించారు. వీరి మొదటి కచేరి 1938లో వెల్లూరులో జరిగింది.
1953 పం.లో రాష్ట్రపతిచే సన్మానాన్ని అందుకున్నారు. 1957 సం.లో భారతప్రభుత్యం ఇతనిని ‘పద్మశ్రీ’ అవార్ఢుతో గౌరవించింది.
చెన్నైలో "శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు స్మారక ట్రస్టు", విశాఖపట్నంలో "ద్వారం వెంకటస్వామి నాయుడు కళాక్షేత్రం" స్థాపించబడినాయి. ఈ రెండు నగరాలలోనూ ఈ కళాతపస్వి విగ్రహాలు ప్రతిష్టింపబడ్డాయి. వీరు నవంబర్ 8వ తేదీ 1893 తేదీన బెంగుళూరులో దీపావళి పండుగనాడు జన్మించారు. 1964 నవంబర్ 24వ తేదీన పరమపదించారు.