header

MS Subbulakshmi…యమ్.యస్. సుబ్బులక్ష్మి..

MS Subbulakshmi…యమ్.యస్. సుబ్బులక్ష్మి.. వీరి పేరు వినని సంగీత ప్రియులు ఉండరు
వీరి పేరు వినని సంగీత ప్రియులు ఉండరు. మీరాబాయి ఎటువంటి తాధాత్మతతో శ్రీకృష్ణ భజనలు గానం చేసిందో అంతే నిబద్ధతతో మరో మీరాబాయి తలపించేలా గానం చేసేది.
భారతీయులనే కాకుండా అంతర్జాతీయంగా శ్రోతలను తన గానంతో మంత్ర ముగ్దులను చేసింది.
కర్ణాటక సంగీత ప్రముఖురాలు ఎం.ఎస్‌. సుబ్బలక్ష్మి. తమిళనాడు రాష్ట్రంలోని మదురైలో 1916 సెప్టెంబరు 16న న్యాయవాది సుబ్రమణ్య అయ్యర్‌, వీణా విద్వాంసురాలు షణ్ముఖ వడివూ అమ్మాళ్‌కు సుబ్బలక్ష్మి జన్మించారు
చిన్నతనంలోనే పాఠశాల విద్య మాని అన్నయ్య, అక్కయ్యలతో ఇంటివద్దనే చదువుకుంటూ సంగీత పాధన చేసేది. 10 సం.ల వయసులోనే తిరుచురాపల్లిలోని రాక్ ఫోర్డు గుడిలోని వందస్థంభాలమండపంలో తొలి సంగీత ప్రదర్శన ఇచ్చారు.
భారత సాంస్కృతిక రాయబారిగా లండన్, న్యూయార్క్, కెనడా ఇంకా అనేక దేశాలలో సంగీత ప్రదర్శనలు ఇచ్చారు.
1997 సం.లో భర్త సదాశివం మరణంతో బహిరంగ ప్రదర్శనలు మానివేశారు. ఈమె సంగీతానికి పరవశించిన నాటి ప్రధాని నెహ్రూ ఈమెను సంగీత సామ్రాజ్ఙగా కీర్తించారు.
సంగీత ప్రపంచంలో ఎన్నో ఆవార్డులు పొందారు. 1998 సం.లో భారతదేశపు అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’ ఈమెకు లభించింది.
తిరుపతి పూర్ణకుంభం సర్కిల్ లో ఈమె కాంస్య విగ్రహాన్ని అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. తిరుమల వేంకటేశుని శుప్రభాతాన్ని యావత్ ప్రపంచానికి పరిచయం చేశారు.
ఈమె ఆహార్యం భారతీయ సాంప్రదాయ స్త్రీకి ప్రతీకగా ఉంటుంది. నిండైన విగ్రహం, ఒంటినిండా పట్టుచీర, నుదుటి మీద ఎర్రటి కుంకుమ బొట్టు, చేతుల నిండా గాజులు, కళ్లకు నిండుగా కాటుక, కొప్పు నిండా మల్లెపూలు, చేతిలో తంబూర పట్టుకొని సంగీత కచేరీ ప్రారంభించగానే శ్రోతలు ఆమె గానలహరిలో మునిగిపోయేవారు.
శృతి, లయ, ఆలపనతో పాటు భావాన్ని, భక్తిని సమపాళ్ళలో వ్యక్తీకరించడంతోపాటు పామరులను సైతం శాస్త్రీయ సంగీతంతో మెప్పించడం ఈమెకు మాత్రమే సాధ్యం. ఐక్య రాజ్య సమితిలో పాడిన గాయనిగా చరిత్ర సృష్టించారు. రాయల్ ఆల్బర్ట్ హాల్, లండన్లో ప్రదర్శన యిచ్చినపుడు ఇంగ్లండ్ రాణిని కూడా తన్మయురాలిని చేసి ఆమె ప్రశంసలు పొందింది.
ఈ మహాగాయని 2004, డిసెంబర్ 11వ తేదీన హృదయ సంభంధమైన సమస్యలతో చెన్నైలో దివంగతులైనారు. /p>