వివిధ నాట్యకళారీతులలో నేర్పరి. సుప్రసిద్ధ నాట్యాచార్యుడు.
మరుగున పడిన పేరిణీ శివతాండవం, ఆంధ్రనాట్యాలకు పునజ్జీవనం పోసి ఈ ప్రాచీన నాట్యాలను తిరిగి వెలుగులోని తెచ్చాడు.
వీరి తల్లిదండ్రులు తూర్పు గోదావరి జిల్లాకు చెందినవారు. వీరు ఇండోనేషియా దేశంలోని బాలి ద్వీపానికి వలస వెళ్లారు. నటరాజ రామకృఫ్ణ 1933 సం. మార్చి 11వ తేదీన బాలీద్వీపంలోనే జన్మించారు. ఇతని చిన్నతనంలోనే వీరి కుటుంబం నాగపూరుకు తిరిగి వచ్చారు. .
మీనాక్షి సుందరం పిళ్ళై, వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి, నాయుడుపేట రాజమ్మ, పెండెల సత్యభామలు మొదలగు వారి దగ్గర నాట్యంలో శిక్షణ పొందారు. . 18 ఏళ్ళ వయసులో నాగపూరులో ఆయనకు "నటరాజ" అనే బిరుదును ఇచ్చారు.
వీరు ఆంధ్రానాట్యం, పేరిణీతాండవం నృత్యాల అభవృద్ధికై లక్షా ఏబై వేల రూపాలతో ఆంధ్రనాట్య సంస్థను నెకొల్పాడు. అనేకమంది దేవదాసీ నృత్యకళాకారులను సంఘటితం చేసి వారి సాంప్రదాయ నృత్యాలను అధ్యయనం చేశారు. .
వీరు 2011 జూన్ 7వతేదీన హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
/p>