దేవుడు సృష్టించిన మనిషే ఆ దేవుణ్ణి అద్భుతంగా చిత్రించి మనముందుంచిన అద్భుత చిత్రకారుడు రాజా రవివర్మ. ఈయన కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురానికి దగ్గరలోని కిలిమనూరు రాజకుటుంబంలో 1848 ఏప్రియల్ 29న జన్మించారు.
దేవుళ్లను అద్భుతంగా చిత్రీకరించి మన ఇళ్లలో పెట్టుకునే విధంగా చేసిన గొప్ప చిత్రకారుడు రాజా రవివర్మ. రామాయణ కావ్యనాయకుడు శ్రీరాముని సుందరమైన రూపం మన కళ్లముందు ఆవిష్కరింప జేసిన కళాకారుడు. రాముడు, కృష్ణడు, శివుడు, బ్రహ్మ, లక్ష్మీ సరస్వతుల రూపాలను మన కళ్లముందుంచిన రూపశిల్పి.
ప్రేమతో వెను తిరిగి చూస్తున్న శకుంతల అద్భుత చిత్రం రాజారవివర్మ చిత్రకళా నైపుణ్యానికి ఓ మచ్చుతునక. అందాల రాశి దమయంతి చిత్రం భారతీయ కావ్య స్త్రీలలో గొప్ప చిత్రంగా పేరుపొందింది. రామాయణంలో రావణుని కత్తివేటకు తెగిపడిన జటాయువు చిత్రం రవివర్మ గొప్ప చిత్రకళాభిరుచికి ఒక గొప్ప ఉదాహరణ.
ఈయన సామాజిక చిత్రాలు కూడా గీసాడు కానీ వీటికి అంత పేరు రాలేదు. 1893లో దక్షిణ భారతదేశంలో జిప్సీల పేదరికాన్ని, నిస్సహాతను, కారాగారంలోని స్త్రీల కోపాన్ని, రాజపుత్రుల సాహసాన్ని అద్భుతంగా చిత్రీకరించిన వాటిలో ఒకటి.
వీరు అక్టోబర్ 2, 1906 లో పరమపదించారు.