header

Tansen…తాన్ సేన్.. గొప్ప సంగీత విద్యాంసుడు, గాయకుడు

Tansen…తాన్ సేన్.. గొప్ప సంగీత విద్యాంసుడు, గాయకుడు
అక్బర్ ఆస్థానంలో గొప్ప సంగీత విద్యాంసుడు, గాయకుడు. హిందూస్ధానీ శాస్త్రీయ సంగీత కారుడు ఇతను ఎన్నో రాగాలను ఆవిష్కరించాడు. మియా-కి-తోడి, దర్బారీ కనడ’ రాగాలను వీరే కనిపెట్టారు. రుద్రవీణ కూడా వీరే కనిపెట్టారని చెబుతారు.
హిందూ కుటుంబంలో జన్మించిన తాన్సేన్ రేవా రాజు రాజా రామచందర సింగ్ ఆస్థానంలో తన గానాన్ని ప్రారంభించాడు.తన జీవితకాలంలో తన అరవై ఏట వరకు ఇతని ఆస్థానంలోనే గడిపాడు. ఇతని కీర్తి ప్రతిష్టలు దేశమంతా వ్యాపించాయి.
ఇతని కీర్తి ప్రతిష్టలు విని మొగల్ షాదూషా అక్బర్ ఇతనిని తన ఆస్ధానానికి ఆహ్వానించాడు. 1562 సం.లో తన 60వ ఏట ఈ సంగీత కళాకారుడు అక్బర్ దర్బారులో చేరాడు.
తాన్‌సేన్ ఒక స్వరకర్త, సంగీతకారుడు, గాయకుడు, అతను సంగీత వాయిద్యాలకు ప్రాచుర్యం తెచ్చిపెట్టిన వాయిద్య కారుడు. హిందూస్థానీ సంగీతంలో ఉత్తర భారతీయ సంప్రదాయంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఈయన ఒకడు. 16 వ శతాబ్దంలో తాన్ సేన్ చేసిన అధ్యయనాలు, రూపొందించిన స్వరాలూ చాలా మందికి స్ఫూర్తినిచ్చాయి.
ఇతను స్వతహాగా హిందువు తరువాత అక్బర్ ఆస్థానంలో చేరిన తరువాత అక్బర్ బలవంతంమీద ముస్లింగా మారాడని మరియు ఇతని మరణం తరువాత ఖననం కార్యక్రమాల మీద భిన్నాభిప్రాయాలున్నాయి. /p>