header

Chandragupta Vikramaditya….చంద్రగుప్త విక్రమాదిత్యుడు...

Chandragupta Vikramaditya….చంద్రగుప్త విక్రమాదిత్యుడు... భారతీయ మహా చక్రవర్తులలో గుప్తవంశానికి చెందిన చంద్రగుప్త విక్రమాదిత్యడు ఒకడు. భారతదేశ చరిత్రలో గుప్తుల పరిపాలనను స్వర్ణయుగంగా చెబుతారు. గుప్త సామ్రాజ్యాన్ని స్థాపించిన మొదటి చంద్రగుప్తుని కుమారుడు సముద్రగుప్తుడు. ఈ సముద్రగుప్తుని కుమారుడే చంద్రగుప్త విక్రమాదిత్యుడు. క్రీ.శకం 375 నుండి 413 వరకు సుమారు 38 సంవత్సరాలపాటు ఈయన పరిపాలన సాగింది.
ఇతని రాజ్యం పశ్చిమాన అరేబియా సముద్రం వరకూ వ్యాపించటంతో విదేశాలతో సంభంధాలు పెరిగాయి. చంద్రగుప్తుని రాజ్యకాలంలో గుప్త సామ్రాజ్యం అత్యున్నత స్థితిని పొందింది. ప్రఖ్యాత చైనా యాత్రికుడు పాహియాన్ చంద్రగుప్తుని కాలంలోనే భారతదేశాన్ని సందర్శించాడు.క్రీ.శకం 405 నుండి 411 వరకు బౌద్దుల పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ దేశసంచారం చేస్తూ తాను చూసిన విషయాలను గ్రంథస్తం చేశాడు.
చంద్రగుప్తుని ఆస్థానంలో నవరత్నాలు అనేబడే తొమ్మిదిమంది మహాకవులు, విద్యాంసులు ఉండేవారు. ప్రపంచంలోనే కవికులగురువుగా ప్రసిద్ధి చెందిన మహాకవి కాళిదాసూ కూడా చంద్రగుప్తుని ఆస్థానంలోని వాడేనని కొందరి పండితుల అభిప్రాయం.
సంస్కృతాన్ని రాజభాషగా చేసి భారతీయ జౌన్నత్యానికి పాటుపడ్డాడు చంద్రగుప్తుడు.