బీజపూర్ సంస్థానంలో జాగీర్దార్ గా పనిచేసిన షాజీ భాంస్లే ఇతని తండ్రి. జిజియాబాయ్ శివాజీ తల్లి. జిజియా బాయి గొప్ప దైవ భక్తురాలు. చిన్నతనంలో తల్లి ద్వారా చెప్పబడిన పురాణ కథలు, వీరగాధలు విని శివాజీ ప్రభావితుడయ్యాడు. శివాజీ 19 ఫిబ్రవరి 1630 సంవత్సరంలో జన్మించాడు
హిందువులు ముస్లింల కొలువులో పనిచేయడం ఇష్టంలేక వారిని దాస్య విముక్తులను చేయటానికి, హిందూ ధర్మం కాపాడాటానికి జీవితాంతం కృషి చేసాడు.
1646 సం.లో శివాజీ 17వ ఏటనే మొదటి యుద్దం చేసి బీజాపూర్ సుల్లానులకు చెంది. తోరణ దుర్గాన్ని ఆక్రమించి బీజాపూర్ సుల్తానును నిలువరించాడు. 1659వ సం.లో బీజపూర్ పాలకుడు తన సేనాని అఫ్జల్ ఖాన్ ను శివాజీ మీదకు పంపగా శివాజీ, అఫ్జల్ ఖాన్ తో చర్చలు జరిపుతుండగా అఫ్జల్ ఖాన్ శివాజీ మీద దాడిచేసి చంపబోతాడు. కానీ శివాజీ పులిగోళ్లు ధరించి అఫ్జల్ ఖాన్ పొట్టను చీల్చివేస్తాడు. అప్జల్ ఖాన్ పారిపోతుండగా కత్తితో ఒకే వేటుతో అఫ్జల్ ఖాన్ తల నరికి వేస్తాడు.
1666 సం.లో జౌరంగజేబు శివాజీని ఢిల్లీకి రప్పించి కుట్రచేసి బంధించాడు. కానీ శివాజీ తన తెలివితేటలతో ఔరంగజేబు ఖైదునుండి తప్పించుకుని దాదాపు మూడు నెలల తరువాత తన రాజ్యాన్ని చేరుకున్నాడు.
1674 జూన్ 4వ తేదీన రాయగడ్ దుర్గంలో మహారాష్ట్ర సామ్రాజ్యానికి పట్టాభిషక్తుడై చత్రపతి అయ్యాడు.
ఒకనొక దశలో తన రాజ్యాన్ని తన గురువైన సమర్థ రామదాసుకు సమర్పించాడు. కానీ గురువు కోరిక మేరకు అతని ప్రతినిధిగా రాజ్యాన్ని తిరిగి స్వీకరించాడు. దీనికి గుర్తుగా శివాజీ పతాకం కాషాయరంగులో ఉంటుంది.
శివాజీ పరమత సహనం కలవాడు. ఇతని సైన్యంలో ముస్లింలు కూడా ఉండేవారు. యుద్ధాలలో స్త్రీల జోలికి, పిల్లలు, వృద్ధుల జోలికి వెళ్లేవారు కాదు శివాజీ సైనికులు. తన సైనికులచే బంధించి బడ్డ కళ్యాణి దుర్గాధిపతి కోడలును తల్లిగా భావించి అనేక కానుకలిచ్చి ఆమెను స్వస్థాలానికి పంపిన ధర్మాత్ముడు శివాజీ.
ఢిల్లీ సుల్తాను ఔరంగజేబును ముప్పుతిప్పలు పెట్టి అనేక కోటలను వశపరచుకున్నాడు. శివాజీ సేనాని తానాజీ సింహఘడ్ కోటను కేవలం 50మంది సైనికులతో జయించాడు. కానీ దురదృష్ణవశాత్తూ తానాజీ ప్రాణాలు కోల్పోతాడు. తానాజీని ఉద్దేశించి శివాజీ, గఢ్ (కోట) మిల్ గయా (లభించించి) సింహ ఘో గయా (సింహం మరణించింది) అని అంటాడు.
శివాజీ కాలంలో మహ్మదీయులు చేసిన అరాచకాలకు అంతే లేదు. హిందూ దేవాలయాలను పడగొట్టారు. ఆవులను చంపి ఆ రక్తాన్ని దేవాలయాలలో చల్లారు. శివాజీ వ్యక్తిత్వం చాలా గొప్పది తాను జయించిన ప్రాంతాలలో పవిత్రస్థలాలను ధ్వంసం చేయలేదు. స్త్రీలకు, పిల్లలకు సాయం చేశాడు. దేవాలయాలతో పాటు ముస్లింల కొరకు మసీదులు నిర్మింపచేసాడు. శివాజీ సైన్యాధ్యక్షులు దౌలత్ ఖాన్, సిద్ధిక్ ఇద్దరూ ముస్లింలే. మచ్చలేని మహారాజుగా పేరుపొందాడు
శివాజీ తనపేరుమీదుగా నాణాలను ముద్రించి చెలామణి చేయుంచాడు. ముస్లింల పట్ల వివక్ష ప్రదర్శించకుండా వారిని ఆదరించాడు. శివాజీ గొప్ప పరిపాలకునిగా, హిందూధర్మ సంరక్షకునిగా పేరు పొందాడు. తన జీవితకాలంలో అధికభాగం షుమారు 27 సంవత్సరాల పాటు యుద్ధాలతో గడిపి నాటి భారతదేశంలోని ఎంతో మంది రాజులను ఆదర్శంగా నిలిచాడు.
శివాజీ 1680 సం. 3 ఏప్రియల్ నెలలో అనారోగంతో రాయ్ ఘడ్ కోటలో పరమపదించాడు