header

Rajaraja Narendra….రాజరాజనరేంద్రుడు...

Rajaraja Narendra….రాజరాజనరేంద్రుడు... మొదట బెజవాడ (నేటి విజయవాడ) రాజధానిగా ఉన్న వేంగి దేశానికి రాజు. ఇతను తూర్పు చాళుక్యుడు. తరువాత గోదావరి తీరంలో ఉన్న రాజమహేంద్రవరాన్ని రాజధానిగా మార్చుకున్నాడు.
ఇతని పరిపాలనా కాలం క్రీ.శకం 1035-1061 మధ్య కాలం. ఇతను శివభక్తుడు, వైదిక ధర్మాలను పాటించాడు. వేదాలను అభిమానించాడు. రాజరాజుగా పేరుపొందాడు.
సంప్రదాయ శాస్త్రాల అభిమాని. హిందూ ధర్మాలపట్ల అభిమానంతో వాటిని పోషించాడు. ఇతని కాలానికి ముందు జైన సాంప్రదాయ సాహితీ గాథలే ప్రాచుర్యంలో ఉండేవి.
తాను పాండురాజు సంతతివాడినని ఇతనికి గట్టి నమ్మకం. వ్యాసుడు రచించిన మహాభారతాన్ని నన్నయ్య చేత తెలుగులోని అనువదింప చేశాడు.