header

Ranjitsingh….రంజిత్ సింగ్....

Ranjitsingh….రంజిత్ సింగ్.... పంజాబ్ మహారాజు రంజిత్ సింగ్. సిక్కురాజ్య కూటమిలో సుకార్ చకియా శాఖకు నాయకుడు. తన ప్రతిభతో ఆఫ్గన్ రాజు జమాన్షాను ఓడించి 1799 సం.లో లాహోర్ ను తన రాజ్యంలో కలుపుకున్నాడు.
1822 సం.లో అమృత్ సర్ ను జయించి రెండు సిక్కు రాజధానులను తన ఆధిపత్యంలోనికి తెచ్చుకున్నాడు.
ఇతని రాజ్యం ఉత్తరాన కాశ్మీర్ వరకూ, పశ్చిమాన ముల్తాన్ వరకు, వాయువ్యంలో పెషావర్ వరకు విస్తరించింది.
తన సైనికులకు విదేశీ నిపుణలచే శిక్షణ ఇప్పంచి బలపరచుకున్నాడు
పంజాబీ భాషను పోషించుటయే గాక పంజాబీ బైబిల్, అక్బర్ నామా వంటి అనువాదాలు వెలుగులోకి తెచ్చాడు.