header

Sri Harsha…Harsh Vardhan…శ్రీ హర్షుడు..హర్షవర్ధనుడు...

Sri Harsha…Harsh Vardhan…శ్రీ హర్షుడు..హర్షవర్ధనుడు... శ్రీ హర్షుడుని హర్షవర్ధనుడు అని కూడా అంటారు. మొట్టమొదట స్థానేశ్వర్యం రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. తరువాత క్రీ.శ.606 వ సం.లో తన రాజధానిని కన్యాకుబ్జంలో ఏర్పాటు చేసుకున్నాడు.
ఉత్తర భారతంలో హిమాలయా పర్వత పాదాలనుండి దక్షిణాన నర్మదా నదివరకు, పశ్చిమాన వల్లభి నుండి తూర్పున గంజాం వరకుగల ప్రాంతాలను తన ఏలుబడిలోనికి తెచ్చుకొని పరిపాలించిన మహాచక్రవర్తి శ్రీహర్షుడు.
హర్షుని యంత్రాంగం పటిష్టమైనది. పరిపాలనలో ప్రధానోద్యోగి ‘మహాసంధి విగ్రహాధికారి’. ఇతర సిబ్బంది ఇతనికి సహాయం చేస్తారు. రాష్ట్రపాల రాజప్రతినిధుల ద్వారా జరిగేది. పండిన పంటలో ఆరవ వంతు భూమి శిస్తుగా వసూలు చేసేవారు. ప్రభుత్వ అధికారులకు వేతనాలకు బదులుగా ఫ్యూడలిజం పద్ధతిలో భూములిచ్చేవాడు. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒక సారి ప్రయోగలో ‘మహా పరిషత్’ ఏర్పాటు చేసి విరివిగా దానాలు చేసేవాడు
హర్షుని కాలంలో నలందా విశ్వవిద్యాలయం ఉన్నతంగా వర్థిల్లింది. 10 వేలమంది విద్యార్థలు, 1500 వందల మంది అధ్యాపకులు ఉండేవారట. ఈ విద్యాలయానికి హర్షుడు 100 గ్రామాలను దానంగా ఇచ్చాడని తెలుస్తుంది. హర్షుడు ప్రధమంలో హిందూ మతాన్ని అనుసరించాడు. హర్షునికాలంలో వచ్చిన హుయాన్ స్వాంగ్ వలన ప్రభావితుడై బౌద్దమతాన్ని స్వీకరించాడు. కానీ హిందూమతాన్ని ద్వేషించలేదు. సామ్రాట్ అశోకుని వలె అనేక ప్రజాహిత కార్యాలను అమలుచేశాడు.
హుయాన్ స్వాంగ్ కన్యాకుబ్జం మరియు ప్రయోగ నందు బౌద్ద ఉత్సవాలు నిర్వహించగా హర్షుడు వాటి నిర్వహణలో సాయమందించాడు.
ఆరోజులలో నలందా విద్యాపీఠం ఉన్నత స్థితిలో ఉండేది. హర్షుడు గొప్ప చక్రవర్తియే కాకుండా సంస్కృత కవి కూడా. జీమూతవాహను కథను ‘నాగానందం’, అనే నాటకంగా రచించాడు. ‘ప్రియదర్శిక’ నాటికలను రచించాడు. ఇతని రచనలలో మూడో నాటకం ‘రత్నావళి’ ఉత్తమమైనదిగా పేరు పొందినది. హర్షచరిత్ర, కాదంబరి కావ్యాలను రచించిన ప్రఖ్యాత సంస్కృత కవి హర్షవర్ధనుని ఆస్థానంలోని వాడే. ఉత్తర భారతాన్ని విజయవంతంగా పరిపాలించిన చివరి హిందూ చక్రవర్తి హర్షవర్థనుడు
హుయాన్ స్వాంగ్ తన యాత్ర చరిత్రలో హర్షుని పాలన గూర్చి, కళాసాహిత్య పోషణ గూర్చి గొప్పగా వ్రాశాడు