header

Sri Krishna

శిశుపాలుడు:
శిశుపాలుడు ఛేది రాజ్యాధిపతి ధర్మఘోషుని కుమారుడు.ధర్మఘోషుని తల్లి వసుదేవుని సోదరి శ్రుతదేవి. శిశుపాలుడు పుట్టుకతోనే నాలుగు భుజాలతో, నొసటి మీద కంటితో, గార్దభ స్వరంతో పుట్టాడు చెందారుకలత చెందెతారు. అప్పడు అశీరవాణి ఈ బాలు ఎవరి చేతులలో సాధారణ రూపం పొందుతాడో అతని చేతనే మరణం పొందుతాడని పలుకుతుంది. అప్పటినుండి ఆ బాలుని చూడటానికి వచ్చిన వారి చేతులకందిస్తూ వచ్చారు. ఒక రోజు బలరామకృష్ణులు శిశుపాలుని చూడడానికి వస్తారు. శిశుపాలుని తల్లి శ్రీకృష్ణుని చేతికి ఆ బాలుని ఇస్తుంది. ఆశ్చర్యకరంగా ఆ బాలునికి సాధారణరూపం వస్తుంది. అప్పుడు ఆ బాలుని తల్లి సాత్యతి ఆ బాలుని రక్షించవలసినది కోరుతుంది. శ్రీకృష్ణుడు శిశుపాలుడు తన ఎడల చేసే నూరు తప్పులను మన్నిస్తాను. నూరు తప్పులు దాటితో మరణం తప్పదు అని వరమిస్తాడు. కానీ ధర్మరాజు అశ్వమేధయాగం జయప్రదం ముగించి ఆ సభలో శ్రీకృష్ణునికి ఆగ్రతాంబూలం ఇస్తాడు. ఇది సహించలేక శిశుపాలుడు అనేకమార్లు శ్రీకృష్ణుని దూషిస్తాడు. నూరు తప్పులు పూర్తవగానే శ్రీకృష్ణుడు శిశుపాలుని తన చక్రాయుధంతో సంహరిస్తాడు

మిత్ర బంధం – కుచేలుడు
శ్రీకృష్ణుడు, కుచేలుడు బాల్యమిత్రులు. సాందీపని మహాముని దగ్గర ఇద్దరూ విద్యాభ్యాసం చేస్తారు. అనంతరం కుచేలుడు తన కర్మచేత దారిద్ర్యం అనుభవిస్తాడు. భార్య ప్రోద్బలంచే ధన సహాయంకోసం తమ దగ్గరున్న కొద్దిగా అటుకులు మూటకట్టుకుని కృష్ణభగవానుడి దర్శనం కోసం వస్తాడు. కృష్ణుడు కుచేలుని సాదరంగా ఆహ్వనించి ఉచితాసనం మీద కూర్చుండబెట్టి ఆతిధ్యమిస్తాడు.తన భార్యలు నీళ్ళు పోయగా పాదాలను కడిగి అతిధి సత్కారం చేస్తాడు. కుచేలుని దగ్గరున్న అటుకులు స్వీకరించి కుచేలుడు అడగకుండానే సర్వసంపదలు ప్రసాదిస్తాడు. కుచేలుడు శ్రీకృష్ణుని సత్కారానికి పరమానందభరితుడై వచ్చిన పనిన మరచి ఇంటికి తిరిగి వెళతాడు. కాని ఇంటికి వచ్చేసరికి శ్రీకృష్ణని కృపచేత సర్వసంపదలు కలుగుతాయి. కుచేలుడు నివసించిన చోటు నేటి గుజరాత్ లోని పోర్ బందర్ అంటారు.
తరువాత పేజిలో................ .