మహాభారత యుద్ధానంతరం యాదవకులం అంతఃకలహాలతో నశిస్తుందని గాంధారి శపించింది. అలాగే యాదవకులంలో సాంబుడి కారణంగా పుట్టిన ముసలం (రోకలి ) సముద్రం ఒడ్డున తుంగగా మొలచి అందరి మరణానికి కారణమవుతుంది. బలరాముడు యోగ విద్య ద్వారా తన అవతారాన్ని ముగిస్తాడు. శ్రీకృష్ణుడు అరణ్యాలకు వెళ్ళి అక్కడ నుండి స్వర్గానికి వెళతాడని వ్యాసుని భారతంలో ఉంది. కానీ వేరొక కధనం ప్రకారం రామావతారంలో శ్రీరాముని చేతిలో వధించిబడిన వాలి బోయవానిగా పుడతాడు. ఇతడు అరణ్యంలో విశ్రమిస్తున్న శ్రీకృష్ణుని గమనించక ఒక లేడి మీదకు బాణాన్ని వదులుతాడు. కానీ అది శ్రీకృష్ణుని బొటన వేలుకు తగులుతుంది. దీనితో శ్రీకృష్ణుడు నిర్యాణం చెందుతాడని తెలుపబడింది. ఈ స్థలమే నేటి గుజరాత్ లోని సోమనాధ్ అంటారు (ప్రభాసతీర్ధం)
.